బుగ్గ చుక్క పెట్టుకుంది సీతమ్మ సీతమ్మ
కంటి నిండా ఆశలతో మా సీతమ్మ
తాళిబొట్టు చేతబట్టి రామయ్య రామయ్య
సీత చెయ్యి పట్ట వచ్చే మా రామయ్య
పెద్దలు వేసిన అక్షతలు దేవుడు పంపిన దీవెనలు
దివిలో కుదిరిన దంపతులు ఈ చోట కలిశారు ఇవ్వాల్టికి
ఆటలు పాటలు వేడుకలు
మాటకు మాటలు అల్లరులు
తియ్యని గుర్తుల కానుకలు
వెన్నంటి ఉంటాయి వెయ్యేళ్ళకి
రా రండోయ్ వేడుక చూద్దాం
ఈ సీతమ్మని రామయ్యన్ని ఒకటిగా చేసేద్దాం
ఆడేద్దాం పాడేద్దాం నవేద్దాం ఆ... నవేద్దాం
వారు వీరని తేడా లేదులే ఇకపై ఒక్కటే... పరివారం
పేరు పేరునా పిలిచే వరసలై ఎదిగే ప్రేమలే... గుణకారం
ఇద్దరి కూడిక కాదు ఇది వందల మనసుల కలయికిది
ఈ సుముహూర్తమే వారధిగా
భూగోళమే చిన్నదవుతున్నది
రా రండోయ్ వేడుక చూద్దాం
వేద మంత్రాలతో ఈ జంటని ఆలు మగలందం
ఆడేద్దాం పాడేద్దాం నవేద్దాం ఆ.... నవేద్దాం
కాలం కొమ్మపై మెరిసే నవ్వులై
కలిసే గువ్వలే.... బంధువులు
కదిలే దారిలో మెదిలే గురుతులై
నడిపే దివ్వెలే.... వేడుకలు
ఎపుడో తెలిసిన చుట్టాలు
ఇపుడే కలిసిన స్నేహితులు
మనసుని తడిమిన సంగతులు
కనువిందుగా ఉంది ఈ పందిరి
రా రండోయ్ వేడుక చూద్దాం
అయిన వాళ్ళందరం ఈ వెళిలా ఒక్కటిగా చేరాం
ఆడేద్దాం పాడేద్దాం నవేద్దాం ఆ... నవేద్దాం
Movie : Raarandoi Veduka Choodham
Lyrics : Ramajogayya Sastry
Music : Devi Sri Prasad
Singers : Ranjith, Gopika Poornima
Cast : Naga Chaitanya, Rakul Preet Singh
ReplyDeleteI wish to purchase this blog for 50000 rupees. Message me at whatsapp : 7 0 0 1 382516. We can also become partners to earn money from this website.
Visit my Latest Songs lyrics site: lyrics.1mut.com