శ్రీశీతలాస్తోత్రస్య మహాదేవ ఋషిః- Seetalashtakam Lyrics in Telugu PDF

 అస్య శ్రీశీతలాస్తోత్రస్య మహాదేవ ఋషిః అనుష్టుప్ ఛందః శీతలా దేవతా లక్ష్మీర్బీజం  భవానీ శక్తిః సర్వవిస్ఫోటకనివృత్యర్థే జపే వినియోగః ||..

..

ఈశ్వర ఉవాచ-..

వన్దేఽహం శీతలాం దేవీం రాసభస్థాం దిగంబరాం |..

మార్జనీకలశోపేతాం శూర్పాలంకృతమస్తకామ్ || ౧ ||..

..

వన్దేఽహం శీతలాం దేవీం సర్వరోగభయాపహాం |..

యామాసాద్య నివర్తేత విస్ఫోటకభయం మహత్ || ౨ ||..

.

శీతలే శీతలే చేతి యో బ్రూయాద్దాహపీడితః |...

విస్ఫోటకభయం ఘోరం క్షిప్రం తస్య ప్రణశ్యతి || ౩ ||..

..

యస్త్వాముదకమధ్యే తు ధ్యాత్వా సంపూజయేన్నరః |..

విస్ఫోటకభయం ఘోరం గృహే తస్య న జాయతే || ౪ ||..

.

శీతలే జ్వరదగ్ధస్య పూతిగంధయుతస్య చ |..

ప్రనష్టచక్షుషః పుంసః త్వామాహుర్జీవనౌషధమ్ || ౫ ||..

..

శీతలే తనుజాన్రోగాన్ నృణాం హరసి దుస్త్యజాన్ |..

విస్ఫోటకవిదీర్ణానాం త్వమేకాఽమృతవర్షిణీ || ౬ ||..

.

గలగండగ్రహా రోగా యే చాన్యే దారుణా నృణాం |..

త్వదనుధ్యానమాత్రేణ శీతలే యాంతి సంక్షయమ్ || ౭ ||..

న మన్త్రో నౌషధం తస్య పాపరోగస్య విద్యతే |..

త్వామేకాం శీతలే ధాత్రీం నాన్యాం పశ్యామి దేవతామ్ || ౮ ||..

.

మృణాలతన్తుసదృశీం నాభిహృన్మధ్యసంస్థితాం |..

యస్త్వాం సంచింతయేద్దేవి తస్య మృత్యుర్న జాయతే || ౯ ||..

అష్టకం శీతలాదేవ్యా యో నరః ప్రపఠేత్సదా |..

విస్ఫోటకభయం ఘోరం గృహే తస్య న జాయతే || ౧౦ ||..

.

శ్రోతవ్యం పఠితవ్యం చ శ్రద్ధాభక్తిసమన్వితైః |..

ఉపసర్గవినాశాయ పరం స్వస్త్యయనం మహత్ || ౧౧ ||..

శీతలే త్వం జగన్మాతా శీతలే త్వం జగత్పితా |..

శీతలే త్వం జగద్ధాత్రీ శీతలాయై నమో నమః || ౧౨ ||..

రాసభో గర్దభశ్చైవ ఖరో వైశాఖనందనః |..

శీతలావాహనశ్చైవ దూర్వాకందనికృంతనః || ౧౩ ||..

ఏతాని ఖరనామాని శీతలాగ్రే తు యః పఠేత్ |..

తస్య గేహే శిశూనాం చ శీతలా రుఙ్న జాయతే || ౧౪ ||..

శీతలాష్టకమేవేదం న దేయం యస్యకస్యచిత్ |..

దాతవ్యం చ సదా తస్మై శ్రద్ధాభక్తియుతాయ వై || ౧౫ ||..

..

ఇతి శ్రీస్కాందపురాణే శీతలాష్టకం ||..

శ్రీశీతలాస్తోత్రస్య మహాదేవ ఋషిః- Seetalashtakam Lyrics in Telugu PDF

బతుకమ్మ బతుకమ్మ ఉయ్యాలో Bathukamma Bathukamma Uyyalo Song Lyric in Telugu Font- Letters

బతుకమ్మ బతుకమ్మ ఉయ్యాలో… బంగారు బతుకమ్మ ఉయ్యాలో..

బతుకమ్మ బతుకమ్మ ఉయ్యాలో… బంగారు బతుకమ్మ ఉయ్యాలో..

ఆనాటి కాలాన ఉయ్యాలో… దర్మాంగుడను రాజు ఉయ్యాలో..

ఆనాటి కాలాన ఉయ్యాలో… దర్మాంగుడను రాజు ఉయ్యాలో..

ఆ రాజు భార్యయు ఉయ్యాలో… అతి సత్యవతి యండ్రు ఉయ్యాలో..

ఆ రాజు భార్యయు ఉయ్యాలో… అతి సత్యవతి యండ్రు ఉయ్యాలో…

నూరు నోములు నోమి ఉయ్యాలో… నూరు మందిని కాంచె ఉయ్యాలో..

నూరు నోములు నోమి ఉయ్యాలో… నూరు మందిని కాంచె ఉయ్యాలో..

వారు సూరులై ఉయ్యాలో… వైరులచే హతమయిరి ఉయ్యాలో..

వారు సూరులై ఉయ్యాలో… వైరులచే హతమయిరి ఉయ్యాలో..

తల్లిదండ్రులప్పుడు ఉయ్యాలో… తరగని సోకమున ఉయ్యాలో..

తల్లిదండ్రులప్పుడు ఉయ్యాలో… తరగని సోకమున ఉయ్యాలో..

ధన ధాన్యములను బాసి ఉయ్యాలో… దాయదులను బాసి ఉయ్యాలో..

ధన ధాన్యములను బాసి ఉయ్యాలో… దాయదులను బాసి ఉయ్యాలో..

వనితతో ఆ రాజు ఉయ్యాలో… వనమందు నివసించే ఉయ్యాలో..

వనితతో ఆ రాజు ఉయ్యాలో… వనమందు నివసించే ఉయ్యాలో..

కలికి లక్ష్మిని కూర్చి ఉయ్యాలో… ఘనత పొందిరింక ఉయ్యాలో..

కలికి లక్ష్మిని కూర్చి ఉయ్యాలో… ఘనత పొందిరింక ఉయ్యాలో..

ప్రత్యక్షమై లక్ష్మి ఉయ్యాలో… పలికి వరమడగమనే ఉయ్యాలో..

ప్రత్యక్షమై లక్ష్మి ఉయ్యాలో… పలికి వరమడగమనే ఉయ్యాలో..

వినిపించి వెడదిని ఉయ్యాలో… వెలది తన గర్భమున ఉయ్యాలో..

వినిపించి వెడదిని ఉయ్యాలో… వెలది తన గర్భమున ఉయ్యాలో..

పుట్టుమని వేడగా ఉయ్యాలో… పూబోణి మది మెచ్చి ఉయ్యాలో..

పుట్టుమని వేడగా ఉయ్యాలో… పూబోణి మది మెచ్చి ఉయ్యాలో..

సత్యవతి గర్భమున ఉయ్యాలో… జన్మించే శ్రీలక్ష్మి ఉయ్యాలో..

సత్యవతి గర్భమున ఉయ్యాలో… జన్మించే శ్రీలక్ష్మి ఉయ్యాలో..

అంతలో మునులును ఉయ్యాలో… అక్కడికి వచ్చిరి ఉయ్యాలో..

అంతలో మునులును ఉయ్యాలో… అక్కడికి వచ్చిరి ఉయ్యాలో..

కపిల గాలములు ఉయ్యాలో… కష్యపాంగ ఋషులు ఉయ్యాలో..

కపిల గాలములు ఉయ్యాలో… కష్యపాంగ ఋషులు ఉయ్యాలో..

అత్రి వశిష్టులు ఉయ్యాలో… ఆగండ్రి నను చూచి ఉయ్యాలో..

అత్రి వశిష్టులు ఉయ్యాలో… ఆగండ్రి నను చూచి ఉయ్యాలో..

బ్రతుకగనే ఈ తల్లి ఉయ్యాలో… బతుకమ్మ యనిరంత ఉయ్యాలో..

బ్రతుకగనే ఈ తల్లి ఉయ్యాలో… బతుకమ్మ యనిరంత ఉయ్యాలో..

పిలువుగా అతివలు ఉయ్యాలో… ప్రియముగా తల్లిదండ్రులు ఉయ్యాలో..

పిలువుగా అతివలు ఉయ్యాలో… ప్రియముగా తల్లిదండ్రులు ఉయ్యాలో..

బతుకమ్మ యనుపేరు ఉయ్యాలో… ప్రజలంత అందురు ఉయ్యాలో..

బతుకమ్మ యనుపేరు ఉయ్యాలో… ప్రజలంత అందురు ఉయ్యాలో..

తానూ ధన్యుడంచు ఉయ్యాలో… తన బిడ్డతో రారాజు ఉయ్యాలో..

తానూ ధన్యుడంచు ఉయ్యాలో… తన బిడ్డతో రారాజు ఉయ్యాలో..

నిజ పట్నముకేగి ఉయ్యాలో… నేల పాలించగా ఉయ్యాలో..

నిజ పట్నముకేగి ఉయ్యాలో… నేల పాలించగా ఉయ్యాలో..

శ్రీ మహా విష్ణుండు ఉయ్యాలో… చక్రాంగుడను పేర ఉయ్యాలో..

శ్రీ మహా విష్ణుండు ఉయ్యాలో… చక్రాంగుడను పేర ఉయ్యాలో..

రాజు వేషమున ఉయ్యాలో… రాజు ఇంటికి వచ్చి ఉయ్యాలో..

రాజు వేషమున ఉయ్యాలో… రాజు ఇంటికి వచ్చి ఉయ్యాలో..

ఇల్లింట మనియుండి ఉయ్యాలో… అతివ బతుకమ్మను ఉయ్యాలో..

ఇల్లింట మనియుండి ఉయ్యాలో… అతివ బతుకమ్మను ఉయ్యాలో..

పెండ్లాడి కొడుకుల ఉయ్యాలో… పెక్కు మందిని కాంచె ఉయ్యాలో..

పెండ్లాడి కొడుకుల ఉయ్యాలో… పెక్కు మందిని కాంచె ఉయ్యాలో…

ఆరు వేల మంది ఉయ్యాలో… అతి సుందరాంగులు ఉయ్యాలో..

ఆరు వేల మంది ఉయ్యాలో… అతి సుందరాంగులు ఉయ్యాలో..

ధర్మంగుడను రాజు ఉయ్యాలో… తన భార్య సత్యవతి ఉయ్యాలో..

ధర్మంగుడను రాజు ఉయ్యాలో… తన భార్య సత్యవతి ఉయ్యాలో..

సిరిలేని సిరులతో ఉయ్యాలో… సంతోషమొందిరి ఉయ్యాలో..

సిరిలేని సిరులతో ఉయ్యాలో… సంతోషమొందిరి ఉయ్యాలో..

జగతిపై బతుకమ్మ ఉయ్యాలో… శాస్వతమ్ముగా వెలిసే ఉయ్యాలో..

జగతిపై బతుకమ్మ ఉయ్యాలో… శాస్వతమ్ముగా వెలిసే ఉయ్యాలో..

బతుకమ్మ బతుకమ్మ ఉయ్యాలో… బంగారు బతుకమ్మ ఉయ్యాలో..

బతుకమ్మ బతుకమ్మ ఉయ్యాలో… బంగారు బతుకమ్మ ఉయ్యాలో..

Bathukamma Bathukamma Uyyalo Song Lyric in Telugu Font- Letters

మేతుకునిచ్చే దాత రా- Methuku Niche Raithanna Song Lyric in Telugu

మేతుకునిచ్చే దాత రా.. బ్రతుకునిచ్చే రైతు రా…

మేతుకునిచ్చే దాత రా.. బ్రతుకునిచ్చే రైతు రా….

రైతు కంటి లో నలుసు పడితే

దేశం అంత చీకటేరా..

మేతుకునిచ్చే దాత రా.. బ్రతుకునిచ్చే రైతు రా..

జాము పొద్దుకే నిదుర లేచి

కళ్ళ ఊసులు కడుక్కొని

పాత చెప్పులు చేతి కర్ర

నోటి లోపల గర్రమేసుక మసక చీకటి

చీల్చుకుంటూ పొలం పనులకు  పోవు రా..

మేతుకునిచ్చే దాత రా బ్రతుకునిచ్చే రైతు రా..

మేతుకునిచ్చే దాత రా బ్రతుకునిచ్చే రైతు రా..

ఆసనాలు ప్రణవ్యయమం వ్యయమం తెలియనొడు

దొక్కలేండి బొక్కలేండి దోరణంల మారినొడు

చెమట చెమటై రక్త మాంసం

కరిగి కష్టం చేసేటోడు..

మేతుకునిచ్చే దాత రా బ్రతుకునిచ్చే రైతు రా..

మేతుకునిచ్చే దాత రా బ్రతుకునిచ్చే రైతు రా..

ఆలుబిడ్డలు కూలికేళ్తరు..

ముసలి ముతక ఇల్లు చూస్తారు..

పండుగలు పబ్బలకైన పట్టెడన్నం పప్పు చారే..

జ్వరమునొప్పులు వచ్చిన మందులుండవు సెలవులుండయి

మేతుకునిచ్చే దాత రా బ్రతుకునిచ్చే రైతు రా..

మేతుకునిచ్చే దాత రా బ్రతుకునిచ్చే రైతు రా..

ఆకలైతెనే తిండి తింటాడు పంచబక్షాలాశించడు

ఎండవానకు ఓర్చుకుంటడు   బట్టపొట్టకు తృప్తి పడతడు

పూట పూట కు పాటూ పడియి పుడమితల్లిని నమ్ముకుంటడు

మేతుకునిచ్చే దాత రా బ్రతుకునిచ్చే రైతు రా..

మేతుకునిచ్చే దాత రా బ్రతుకునిచ్చే రైతు రా..

వాన అంటాడు కరెంట్ అంటాడు

విత్తనాలు ఎరువులంటడు  పంటలంటడు దరలుఅంటడు పోద్దుమాపు గులుగుంతుంటడు

ఏర్రియేనకకు తగ్గిన మనసులోనే కుములుతుంటడు

మేతుకునిచ్చే దాత రా బ్రతుకునిచ్చే రైతు రా..

మేతుకునిచ్చే దాత రా బ్రతుకునిచ్చే రైతు రా..

యాసంగికి పంటతిస్తాడు వానకాలం పంటతీస్తాడు 

ప్రతి పంటకు అప్పు చేసి పంటపంటకు తీర్చుకుంటాడు

విలువ పోయేసమయం వస్తే యే….

విలువ పోయేసమయం వస్తే నిలువు ప్రాణం తీసుకుంటాడు.😭

Methuku Niche Raithanna Song Lyric in Telugu

Raithu Songs

Methuku Niche Raithanna Song Lyric in Telugu

ఏమైనదో ఏమో నాలో - Emainado Emo Naalo Song Lyrics from Santhosham Movie

ఏమైనదో ఏమో నాలో కొత్తగా ఉంది లోలో..

కలలిలా నిజమైతే వరమిలా ఎదురైతే..

నాలో నీవై నీలో నేనై ఉండాలనే నా చిగురాశనీ..

లోలో పొంగే భావాలన్నీ ఈ వేళిలా నీతో చెపాలనీ ఉన్నది..

అందాల సిరి మల్లె పువ్వూ ఏ మూల దాగవో నువ్వూ..

చిరుగాలిలా వచ్చి నీవూ ఎదలోన సడి రేపినావూ..

ఏదో రోజు నీకై నువ్వు ఇస్తావనే నీ చిరునవ్వుని..

ఎన్నెన్నెన్నో ఆశలతోనే ఉన్నాను నే నీ కోసం ఇలా...

Emainado Emo Naalo Song Lyrics from Santhosham Movie

Movie: Santhosham

Music: RP Patnaik

Lyrics: Sirivennela

ఏమైనదో ఏమో నాలో - Emainado Emo Naalo Song Lyrics from Santhosham Movie

కన్నుల్లో నీ.. రూపమే.. Kannullo Nee Roopame Song Lyrics in Telugu

 కన్నుల్లో నీ.. రూపమే..

గుండెల్లో నీ.. ధ్యానమే

నా ఆశ నీ.. స్నేహమే

నా శ్వాస నీ.. కోసమే

ఆ ఊసునీ.. తెలుపేందుకు

నా భాష ఈ.. మౌనమే

కన్నుల్లో నీ.. రూపమే..

గుండెల్లో నీ.. ధ్యానమే

నా ఆశ నీ.. స్నేహమే

నా శ్వాస నీ.. కోసమే

మదిదాచుకున్న రహస్యాన్ని వెతికేటి నీ చూపునాపేదెలా...

నీ నీలి కన్నుల్లో పడి మునకలేస్తున్న నా మనసు తేలేదెలా..

గిలిగింత పెడుతున్న నీ చిలిపి తలపులతో ఏమో ఎలా వేగడం..

కన్నుల్లో నీ.. రూపమే..

గుండెల్లో నీ.. ధ్యానమే

నా ఆశ నీ.. స్నేహమే

నా శ్వాస నీ.. కోసమే..

అదిరేటి పెదవుల్ని బతిమాలుతున్నాను మదిలోని మాటేదనీ..

తలవంచుకుని నేను తెగ ఎదురుచుశాను నీ తెగువ చూడాలనీ..

చూస్తూనే వేళంతా తెలవారి పోతుందో ఏమో ఎలా ఆపడం..

కన్నుల్లో నీ.. రూపమే..

గుండెల్లో నీ.. ధ్యానమే..

నా ఆశ నీ.. స్నేహమే..

నా శ్వాస నీ.. కోసమే..

ఆ ఊసునీ తెలుపేందుకు..

నా భాష ఈ.. మౌనమే..

కన్నుల్లో నీ.. రూపమే..

గుండెల్లో నీ.. ధ్యానమే..

నా ఆశ నీ.. స్నేహమే..

నా శ్వాస నీ.. కోసమే..

Kannullo Nee Roopame Song Lyrics in Telugu Details

Music Director : Sandeep Chowta 
Lyrics Writer : Sirivennela
Singer : Chitra,  Hari Haran

Kannullo Nee Roopame Song Lyrics in Image Format

Kannullo Nee Roopame Song Lyrics in Telugu Font

Clock on the image to enlarge or clear view.

Priya Ninu Chudaleka Song Lyrics in Telugu Font

ప్రియా నిను చూడలేక ఊహల్లో నీరూపురాక

నీ తలుపుతోనే నే.. బ్రతుకుతున్నా . . .

నీ తలపుతోనే నే.. బతుకుతున్నా..

ప్రియా నిను చూడలేక ఊహల్లో నీరూపురాక…

వీచేటి గాలులను నేనడిగాను నీకుశలం..

ఉదయించే సూర్యుడినే నేనడిగాను నీకుశలం..

అనుక్షణం నామనసు తహతహలాడే..

ప్రతిక్షణం నీకోసం విలవిలలాడే..

అనుదినం కలలలో నీకధలే..

కనులకు నిదురలే కరువాయె..

ప్రియా నిను చూడలేక..

ఊహల్లో నీరూపు రాక..

కోవెలలో కోరితినీ నీదరికీ నను చేర్చమని..

దేవుడినే వేడితినీ కలకాలం నిను చూడమని..

లేఖతో ముద్దయినా అందించరాదా..

నినుగాక నీ కలనీ పెదవంటుకోదా..

వలపులు నీదరి చేరుటెలా..

ఊహల పడవలే చేర్చునులే..

ప్రియా నిను చూడలేక..

ఊహల్లో నీరూపురాక..

హా..అ... నీ తలుపుతోనె బతుకుతున్నా . . .

నీ తలపుతోనే నే బతుకుతున్నా..

ప్రియా నిను చూడలేక ఊహల్లో నీరూపురాక...

Priya Ninu Chudaleka Song Lyrics in Telugu Details

Song Name: Priya Ninu Chudaleka

Movie Name: Prema Lekha(1996)

Music: Deva

Priya Ninu Chudaleka Song Lyrics in Telugu

ఏవేవో కలలుకన్నా| Yevevo Kalalukanna Song Lyrics in Telugu- Hello Movie

Evevo Kalalu Kanna Song Lyrics in Telugu

ఏవేవో కలలుకన్నా …..

ఏవైపో కదులుతున్నా…..

ఏమైందో తెలియకున్నా …..

ఎన్నెన్నో జరుగుతున్నా…..

ఏమో ఏమైందో నాలోనే ఏమైందో….

ఏమో ఏముందో…..

ఇక ముందేం కానుందో …..

ఇదేమి ఇదేమిటో.....

ఈ మాయ పేరేమిటో…..

ఇదేమి ఇదేమిటో…..

ఈ మాయ పేరేమిటో…..

 ఏవేవో కలలుకన్నా …..

ఏవైపో కదులుతున్నా…..

ఏమైందో తెలియకున్నా …..

ఎన్నెన్నో జరుగుతున్నా…..

ఏమో ఏమైందో నాలోనే ఏమైందో…..

ఏమో ఏముందో…..

ఇక ముందేం కానుందో ..

ఇదేమి ఇదేమిటో…..

ఈ మాయ పేరేమిటో…..

ఇదేమి ఇదేమిటో…..

ఈ మాయ పేరే ఎమిటో…..

తలచుకున్నా వేళల్లో తెలుసుకున్న వెలుగేమిటో…..

కలుసుకున్నా వేళల్లో క్షణముకింత విలువేమిటో…..

ఇక నేను నా నువ్వు మనం అయిన…

ఈ వేళల్లో ఈ మెరుపేమిటో…

ఈ పరుగేమిటో  మైమరపేమిటో…..

హ ఈ గీతాలలో ఈ బషేమిటో…..

బావలేమిటో  ఈ తీయని….. బందమేమిటో..

ఏవేవో కలలుకన్నా ఏవైపో కదులుతున్నా..

ఏమో ఏమైందో నాలోనే ఏమైందో…

ఏమో ఏముందో….

ఇక ముందేం కానుందో

ఇదేమి ఇదేమిటో…

ఈ మాయ పేరేమిటో…

ఇదేమి ఇదేమిటో…

ఈ మాయ పేరేమిటో….

ఏవేవో కలలుకన్నా| Yevevo Kalalukanna Song Lyrics Details

Movie: Hello

Music: Anup Rubens

Lyrics: Chandrabose

Singers: Akhil Akkineni, Jonita Gandhi

ఆగేది లేదు ఎదురే అడ్డేమున్న - Marvel Anthem Telugu Lyrics

 అంతులేని ఆ అంతరిక్షమే దాటి

శూన్యం లా కనిపించే ఓ గమ్యం

లోకమున్నను లేకపొయ్నను నా పయనం

భయమే దాటి బదులే చెప్పే నీ సమయం..

ఆగేది లేదు ఎదురే అడ్డేమున్న ఆగేది లేదు ఎవరాపాలనుకున్నా..

ఆగేది లేదు ఎదురే అడ్డేమున్న ఆగేది లేదు ఎవరాపాలనుకున్నా..

చరిత్రలన్ని తిరగరాయ్ స్థితిగతుల్ని మార్చివై

విశ్వసించు విశ్వముంది రా.. 

నిశ్క్రమించనేల నేడు నిర్ణయించుకోరా

న్యాయమేదొ నిర్వచించరా ..

పడిపోయి లేవలేక లేచినప్పుడే విజేత 

ఓటమేదొ గెలుపు మార్గం 

వెన్నుచూప బోకముందు ముల్ల బాటలున్న

ప్రాణమంత పిడికిలవ్వగా..

సాగిపో ఓ ధీరా భవికే మనథీరా

ధర్మం నిలుపరా..

ధర్మం నిలుపరా..

ఆటుపోట్లనన్ని దాటి రాటుతేలె గుండెదాటి ..

చూపుతాము పొగరుతోటి మేము ఒక్కటి ..

కాస్త తిక్కున్నది దాని లెక్కున్నది..

మా మాటంటే మాటే మరి..

ఆగేది లేదు ఎదురే అడ్డేమున్న ఆగేది లేదు ఎవరాపాలనుకున్నా..

ఆగేది లేదు ఎదురే అడ్డేమున్న ఆగేది లేదు ఎవరాపాలనుకున్నా..

సిద్ధం కా...... ఓఓఓఓఓఓఓ..

సిద్ధం కా......  ఓఓఓఓఓఓఓ..

చుక్కల్లో చేరిన స్నేహితుడా ఇది నీకోసం

ఓఓఓఓఓఓఓ సిద్ధం కా..

ఓఓఓఓఓఓఓ సిద్ధం కా..

సాగిపో ఓ ధీరా భవికే మనథీరా

ధర్మం నిలుపరా..

ధర్మం నిలుపరా..

Marvel Anthem Telugu Lyrics - Avenger's Endgame | A.R Rahman

Materani Chinnadani Song Lyrics in Telugu

మాటే రాని చిన్నదాని కళ్ళు పలికే ఊసులు..

అందాలన్నీ పల్లవించీ ఆలపించే పాటలు..

ప్రేమే నాకు పంచే..జ్ఞాపకాలురా..

రేగే మూగ తలపే..వలపు పంటరా!!

మాటే రాని చిన్నదాని కళ్ళు పలికే ఊసులు..

అందాలన్నీ పల్లవించీ ఆలపించే పాటలు..

ప్రేమే నాకు పంచే..జ్ఞాపకాలురా..

రేగే మూగ తలపే..వలపు పంటరా!!

వెన్నెలల్లే పూలు విరిసే తేనెలు చిలికెను..

చెంతచేరి ఆదమరచి ప్రేమలు కొసరెను..

చందనాలు జల్లు కురిసె చూపులు కలిసెను..

చందమామ పట్టపగలే నింగిని పొడిచెను!!

కన్నె పిల్ల కలలే నాకిక లోకం..

సన్నజాజి కళలే మోహన రాగం..

చిలకల పలుకులు అలకల ఉలుకులు

నా చెలి సొగసులు నన్నే మరిపించే!!

మాటే రాని చిన్నదాని కళ్ళు పలికే ఊసులు..

అందాలన్నీ పల్లవించీ ఆలపించే పాటలు..

ముద్దబంతి లేత నవ్వులు చిందెను మధువులు..

ఊసులాడు మేని వగలు వన్నెల జిలుగులు..

హరివిల్లులోని రంగులు నాచెలి సొగసులు

వేకువల మేలుకొలుపే  నా చెలి పిలుపులు

సందెవేళ పలికే నాలో పల్లవి..

సంతసాల సిరులే నావే అన్నవి..

ముసి ముసి తలపులు తరగని వలపులు..

నా చెలి సొగసులు అన్నీ ఇక నావే!!

మాటే రాని చిన్నదాని కళ్ళు పలికే ఊసులు..

అందాలన్నీ పల్లవించీ ఆలపించే పాటలు..

ప్రేమే నాకు పంచే..జ్ఞాపకాలురా..

రేగే మూగ తలపే..వలపు పంటరా!!

మాటే రాని చిన్నదాని కళ్ళు పలికే ఊసులు..

అందాలన్నీ పల్లవించీ ఆలపించే పాటలు..

Materani Chinnadani Song Lyrics Details

Actress : Raadhika

Music Director : Ilayaraja

Lyrics Writer : Veturi

Singer : SP Balu

ఉసురే పోయెనే - Usure Poyene Lyrics in Telugu from Villain Movie

ఈ భూమిలో ఏప్పుడంట నీ పుటక నా బుద్ధిలోన నువ్వు చిచ్చు పెట్టాక..

ఈ నల్లమల అడవి ఎంత పెద్దదైన ఈ అగ్గిపుల్ల తానెంత చిన్నదైనా..

ఈ నల్లమల అడవి ఎంత పెద్దదైన ఈ అగ్గిపుల్ల తానెంత చిన్నదైనా..

ఈ చిన్న అగ్గిపుల్ల భగ్గుమంటే ఇంకా ఈ నల్లమల అడవి కాలి బూడిదవ్వదా..

ఉసురే పోయెనే ఉసురే పోయెనే కదిలే పెదవులు చూడగనే

ఓ ప్రేమకు తపించి వేడుతు ఉన్నా మనసుని ఇవ్వవే మదనాల

అందని తీరాన నీవున్నా హత్తుకుపోవే దరిచేరి

అగ్గిపండు నువ్వని తెలిసి అడుగుతువున్న ఉడుకు రుచి..

ఒంటికి మనసుకు ఆమడ దూరం కలిపేదెట్టా తెలియదుగా

మనసే చెప్పే మంచి సలహా మాయ శరీరం వినదు కదా

తపనే తొలిచే నా పరువము బరువు కదా

చిలిపి చిలకే మరి నను గలికొలికే కదా..

ఈ మన్మధ తాపం తీరునా ఈ పూనకాల కోడి పెట్ట తీర్చునా

ఈ మాయదారి పిచ్చి తీర్చి మన్నించెనా

చందురుడు సూరీడు చుట్టి ఒక్కచోట చేరిపోయే

సత్యమసత్యము నేడు చీకటింటి నీడలాయే..

ఉసురే పోయెనే ఉసురే పోయెనే కదిలే పెదవులు చూడగనే

ఓ ప్రేమకు తపించి వేడుతువున్న మనసును ఇవ్వవే మదనాల

అందని తీరాన నీవున్నా హత్తుకుపోవే దరిచేరి

అగ్గిపండు నువ్వని తెలిసి అడుగుతువున్న ఉడుకు రుచి..

ఇది కొత్త కాదు పాతబడ్డ జగతికి

తాను కాచుకోదు కళ్లులేని కట్టడిది

మనం చట్టమంటూ గీసుకున్న గిరి ఇది

దాని బొక్కలెన్నో లెక్కపెట్టి చూడు మరి..

మబ్బులు విడిచిన సూర్యుని చూసి మొగ్గలు విచ్చును తామరా

దూరం భారం చూడానిదొకటే నీకు పుట్టిన ప్రేమరా

పాపం వేరా అన్న తేడా తెలియదులే

పామే ఐనా ఇక వెనకడుగుండదులే..

చితి మంటలు రేగిన వేళలో నా కన్నుల చల్లని నీ రూపే

నే మట్టి కలిసిన మదిలో నీవే

చందురుడు సూరీడు చుట్టి ఒక్కచోట చేరిపోయే

సత్యమసత్యము నేడు చీకటింటి నీడలాయే..

ఉసురే పోయెనే ఉసురే పోయెనే కదిలే పెదవులు చూడగనే

ఓ ప్రేమకు తపించి వేడుతువున్న మనసును ఇవ్వవే మదనాల

అందని తీరాన నీవున్నా హత్తుకుపోవే దరిచేరి

అగ్గిపండు నువ్వని తెలిసి అడుగుతువున్న ఉడుకు రుచి..

ఉసురే పోయెనే ఉసురే పోయెనే కదిలే పెదవులు చూడగనే

ఓ ప్రేమకు తపించి వేడుతువున్న మనసును ఇవ్వవే మదనాల

అందని తీరాన నీవున్నా హత్తుకుపోవే దరిచేరి

అగ్గిపండు నువ్వని తెలిసి అడుగుతువున్న ఉడుకు రుచి..

Usure Poyene Lyrics in Telugu from Villain Movie Details

Song Name: Usure Poyene Movie: Villain Singer: Karthik Music: A.R. Rahman Lyrics: Veturi Sundararama Murthy