Skip to main content

Posts

Showing posts from July, 2021

Vaishnavi bhargavi vagdevi song lyrics in Telugu

వైష్ణవి భార్గవి వాగ్దేవి త్రిగుణాత్మికే వింధ్యవిలాసిని వారాహి త్రిపురాంబికే భవతి విద్యాందేహి భగవతి సర్వార్ధ సాధికే సత్యార్ధ చంద్రికే మాంపాహి మహనీయ మంత్రాత్మికే మాంపాహి మాతంగి మాయాత్మికే ఆపాతమధురము సంగీతము అంచిత సంగాతము సంచిత సంకేతము శ్రీభారతీ క్షీరసంప్రాప్తము అమృతసంపాతము సుకృతసంపాకము సరిగమ స్వరధుని సారవరూధుని సామ సునాదవినోదిని సకలకళాకళ్యాణి సుహాసిని శ్రీరాగాలయ వాసిని మాంపాహి మకరంద మందాకినీ! మాంపాహి సుజ్ఞాన సంవర్ధినీ! ఆలోచనామృతము సాహిత్యము సహితహితసత్యము శారదాస్తన్యము సారస్వతాక్షర-సారధ్యము జ్ఞానసామ్రాజ్యము జన్మసాఫల్యము సరస వచోబ్ధిని సారసలోచని వాణీ పుస్తకధారిణీ! వర్ణాలంకృత-వైభవశాలిని వరకవితాచింతామణీ మాంపాహి సాలోక్యసంధాయినీ! మాంపాహి శ్రీచక్ర సిమ్హాసినీ!

Ooruko Hrudayama Song Lyrics in Telugu

ఊరుకో హృదయమా ఉప్పెనై రాకుమా.. మాట మన్నించుమా బయటపడిపోకుమా.. చెయ్యేత్తి దీవించే వేళ నీ కళ్ళలో జలపాతాలా.. నీపేరు నిట్టూర్పుల జ్వాలా ప్రణయమా.. ఊరుకో హృదయమా ఉప్పెనై రాకుమా.. చూపులో శూన్యమై పెంచుతూ ఉన్నది.. జాలిగా కరుగుతూ అనుబంధం.. చెలిమితో చలువనే పంచుతూ ఉన్నది.. జ్యోతిగా వెలుగుతూ ఆనందం.. కలత  ఏ కంటిదో మమత ఏ కంటిదో.. చెప్పలేనన్నది చెంప నిమిరే తడి.. చెయ్యెత్తి దీవించే వేళ నీ కళ్ళలో జలపాతాలా.. నీ పేరు నిట్టూర్పుల జ్వాలా ప్రణయమా.. దేహమే వేరుగా స్నేహమే పేరుగా.. మండపం చేరనీ మమకారం.. పందిరై పచ్చగా ప్రేమనే పెంచగా.. అంకితం చేయనీ అభిమానం.. నుదిటిపై కుంకుమై మురిసిపో నేస్తమా.. కళ్ళకే కాటుకై నిలిచిపో స్వప్నమా.. చెయ్యెత్తి దీవించే వేళ నీ కళ్ళలో జలపాతాలా.. నీ పేరు నిట్టూర్పుల జ్వాలా ప్రణయమా.. ఊరుకో హృదయమా ఉప్పెనై రాకుమా.. మాట మన్నించుమా బయటపడిపోకుమా.. Music Director : RP. Patnaik Lyrics Writer : Sirivennela Singer : Krishna Kumar Kunnath