Skip to main content

Posts

Showing posts from April, 2023

Balarama Narsayyo Song Lyrics in Telugu from Balagam movie

శ్రీహరి రాఘవులే ఏ ఏ ఏయ్  అయ్యో బాలి బాలి బాలి అయ్యో బాలి బాలి బాలి ఏ దిక్కు పోతున్నవే బాలి నువ్వున్న ఇల్లు ఇడిసి బాలి నువ్వున్న జాగ ఇడిసి బాలి నువ్వుతిన్న కంచం ఇడిసి బాలి నువ్ పన్న మంచం ఇడిసి బాలి ఆటేటు పోతున్నవే బాలి గోవిందా గోవిందా బలరామ నరసయ్యో బలరామ నరసయ్యో బంగారి తోవబట్టి బయలెల్లుతుంటివో బలరామ నరసయ్యో బలరామ నరసయ్యో బలరామ నరసయ్యో బంగారి తోవబట్టి బయలెల్లుతుంటివో బలరామ నరసయ్యో బలరామ నరసయ్యో బలరామ నరసయ్యో బాధంటు లేని సోటు ఎతుక్కుంట పోతివో బలరామ నరసయ్యో బలరామ నరసయ్యో బలరామ నరసయ్యో బాధంటు లేని సోటు ఎతుక్కుంట పోతివో బలరామ నరసయ్యో తీరు తీరు యేషాలేసి ఎంత అలసి పోయినవో తోడురాని మంది కోసం తిప్పలెన్ని మోసినవో కట్లు తెంచుకోని నేడు కైలాసం పోతున్నవో బలరామ నరసయ్యో బలరామ నరసయ్యో బంగారి సావునీది బయలుదేరి పోవయ్యో బలరామ నరసయ్యో బలరామ నరసయ్యో బలరామ నరసయ్యో భూమ్మీద లేని హాయి సచ్చి అనుభవించయ్యో బలరామ నరసయ్యో బాల మల్లేశా బైలు మల్లేశా బాల మల్లేశా బైలు మల్లేశా రాంగ రాంగ ఏమి తేమురో కొడుకా పొంగ ఏమి కట్క పోమురో కొడుకా బాల మల్లేశా బైలు మల్లేశా బాల మల్లేశా బైలు మల్లేశా తొమ్మిది తొర్రలురో కొడుకా ఒళ్లు ఉత్త తోలు త

Thoduga Ma Thodundi Telugu song Lyrics from Balagam movie

తోడుగా మా తోడుండి నీడగా మాతో నడిచి (తోడుగా మా తోడుండి నీడగా మాతో నడిచి) నువ్వెట్టా వెళ్ళినావు కొమురయ్యా నీ జ్ఞాపకాలు మరువమయ్యో కొమురయ్యా కొడుకునెట్లా మర్సినావే కొమురయ్యా నీ బిడ్డనెట్టా మర్సినావే కొమురయ్య బలగాన్ని మర్సినావా బాంధవుల మర్సినావా బలగాన్ని మర్సినావా బాంధవుల మర్సినావా నువ్వెక్కడెల్లినావు కొమురయ్యా నీ జ్ఞాపకాలు మరవలేము కొమురయ్యా ఇయ్యాల కొమురయ్య మా అందు గలిగి, మాతో ఈ పదాలు పలికిస్తున్నాడో ఏమో..! ఎల్లిపోతున్న నా కొడుకా నా కొడుకా ఐలయ్య, కైలయ్య అయ్యయ్యో నా కొడుకా ఐలన్న ఎల్లిపోతున్న నా కొడుకా సినకొడకా మొయిలన్న, మొయిలన్న సినకొడకా మొయిలన్న, బైలన్న దయగల్ల లచ్చవ్వ, లచ్చవ్వ నేనెళ్ళిపోతున్న నా బిడ్డా నేనెళ్ళిపోతున్న లచ్చవ్వ అయ్యా లచ్చవ్వ..! నన్నిచ్చిన దేవుడేమో నా కాకు జింపినాడు నా ఆట ముగిసిందని నన్ను పైకి బిలిసినాడు నువ్వు కాశీకి బోయినగాని, నా కొడుకా కన్నతండ్రి గాన రాడు, నా కొడుకా ఏ తీర్థము తిరిగినగాని, నా బిడ్డ ఈ కన్నతండ్రి తిరిగిరాడు, నా బిడ్డ పెద్ద కొడుకా ఐలయ్య, నా తొలిసూరు కొడుకువు..! ప్రేమగల్ల పెద్ద కొడకా ఐలన్న నిన్ను పావురంగా సాదుకున్న ఐలన్న పావురంగా సాదుకున్న ఐలన్న గున్న గున్న తిరు