Search Suggest

Sri yesundu janminche reyilo song lyrics in Telugu

శ్రీ యేసుండు జన్మించె రేయిలో (2) నేడు పాయక బెత్లెహేము ఊరిలో (2), ఆ కన్నియ మరియమ్మ గర్భమందున (2) ఇమ్మానుయేలనెడి నామమందున (2)
Sri yesundu janminche reyilo


శ్రీ యేసుండు జన్మించె రేయిలో (2)

నేడు పాయక బెత్లెహేము ఊరిలో (2)           ||శ్రీ యేసుండు||


ఆ కన్నియ మరియమ్మ గర్భమందున (2)

ఇమ్మానుయేలనెడి నామమందున (2)        ||శ్రీ యేసుండు||


సత్రమందున పశువులశాల యందున (2)

దేవపుత్రుండు మనుజుండాయెనందునా (2)  ||శ్రీ యేసుండు||


పట్టి పొత్తి గుడ్డలతో చుట్టబడి (2)

పశుల తొట్టిలో పరుండ బెట్టబడి (2)             ||శ్రీ యేసుండు||


గొల్లలెల్లరు మిగుల భీతిల్లగా (2)

దెల్పె గొప్ప వార్త దూత చల్లగా (2)               ||శ్రీ యేసుండు||


మన కొరకొక్క శిశువు పుట్టెను (2)

ధరను మన దోషములబోగొట్టెను (2)            ||శ్రీ యేసుండు||


పరలోకపు సైన్యంబు గూడెను (2)

మింట వర రక్షకుని గూర్చి పాడెను (2)         ||శ్రీ యేసుండు||


అక్షయుండగు యేసు పుట్టెను (2)

మనకు రక్షణంబు సిద్ధపరచెను (2)              ||శ్రీ యేసుండు||

Post a Comment