సింగారాల పైరుల్లోన బంగారాలే పండేనంట పాడాలి
నవ్వుల్లోన పువ్వుల్లాగా జీవితాలే సాగాలంట ఆడాలి..

ఈనాడు ఊరంతటా రాగాల దీపాలట
నీకోసం వెలిగేనట ఉల్లాసం నీదేనట....

వద్దంటానే పాతదనాన్ని ముద్దంటానే కొత్తదనాన్ని
కొత్తగ ఇపుడే పుట్టావని అనుకోమంట
బతుకే దారి పోతే ఏంటి బాటేదైనా నీకది ఏంటి
నారుని వేసే ఆ పైవాడే నీరే పోస్తాడే
మూలబడి ఉన్న బుట్ట తట్ట తీసి బోగి మంటలలోన నీవే వెయ్యరా
తెల్ల వారగానే సంకురాత్రి కాదా పొంగే పాలు అందరి పాలు హాయిగా
నేల తల్లి పంచేనంట పైడి పంట నీకు నాకు అంతకంటే సందడేది లేదే...
సింగారాల పైరుల్లోన బంగారాలే పండేనంట పాడాలి
నవ్వుల్లోన పువ్వుల్లాగా జీవితాలే సాగాలంట ఆడాలి..
ఈనాడు ఊరంతటా రాగాల దీపాలట
నీకోసం వెలిగేనట ఉల్లాసం నీదేనట....
సింగారాల పైరుల్లోన బంగారాలే పండేనంట పాడాలి
నవ్వుల్లోన పువ్వుల్లాగా జీవితాలే సాగాలంట ఆడాలి..
బంధాలేంటి బంధువులేంటి పోతే ఏంటి వస్తే ఏంటి
తిండే లేదని దిగులే పడని జన్మే నాదిరా
మనసే ఇచ్చి చెయ్యందించి తోడై నీడై మిత్రుడు వెలిసే
ఆతని కంటే చుట్టాలెవరు నాకే లేరంట
హృదయం మాత్రం నాదే ఊపిరి కాదా తనదే
నా నేస్తం కోసం ప్రాణాలైనా ఇస్తానే
నా మిత్రుడు పెట్టే తిండి నీ తింటున్నానీవేళ
తన మాటే నాకు వేదం అంట ఏ వేళ
శోకం వీడే స్వర్గం చూసే రాగం పాడే తాళం వేసే
పాటలు పాడే పువ్వుల జంట మేమే....
సింగారాల పైరుల్లోన బంగారాలే పండేనంట పాడాలి
నవ్వుల్లోన పువ్వుల్లాగా జీవితాలే సాగాలంట ఆడాలి..
సింగారాల పైరుల్లోన బంగారాలే పండేనంట పాడాలి
నవ్వుల్లోన పువ్వుల్లాగా జీవితాలే సాగాలంట ఆడాలి..
ఈనాడు ఊరంతటా రాగాల దీపాలట
నీకోసం వెలిగేనట ఉల్లాసం నీదేనట....
సింగారాల పైరుల్లోన బంగారాలే పండేనంట పాడాలి
నవ్వుల్లోన పువ్వుల్లాగా జీవితాలే సాగాలంట ఆడాలి..
Movie : Dalapathi
Lyrics : Raja Sri
Music : Ilayaraja
Singers : S P Balu, Yesudasu