Search Suggest

Emantave O Manasa Song Lyrics Ninne Ishtapaddanu Movie (2003)

ఏమంటావే ఓ మనసా నీకెందుకే ఇంత ఆశా ఏమైందని ఓ వయసా మారిందిలా నీ వరస వరించే కలలొచ్చి వరాలే కురిపించి స్వరాలై నీతో చేరి పలికేయా ఈ హైలో హైలెస్సా ఓ... ఓ.

ఏమంటావే ఓ మనసా నీకెందుకే ఇంత ఆశా

ఏమైందని ఓ వయసా మారిందిలా నీ వరస

వరించే కలలొచ్చి వరాలే కురిపించి

స్వరాలై నీతో చేరి పలికేయా ఈ హైలో హైలెస్సా

ఓ... ఓ... ఓ... ఓ...

ఓ... ఓ... ఓ... ఓ...


సంకోచం చాలు అని ఇంకొంచం చేరమని చోటిచ్చిందా ఈ స్నేహం

అవకాశం చూసుకొని సావాసం పంచమని అందించిందా ఆహ్వానం

చినుకంత చిన్నతడి వెంటపడి వెళ్ళువగ మారిందా

అణువణువు తుళ్ళి పడి గుండేసడి ఝల్లుమని మోగిందా

ఆరాటం అనురాగం తెలిపిందా బహుశా

ఓ... ఓ... ఓ... ఓ...

ఓ... ఓ... ఓ... ఓ...


మోమాటం కప్పుకొని ఏమాట చెప్పనని ఎన్నాళ్ళింకా ఈ మౌనం

జడివానై కమ్ముకొని సుడిగాలై చుట్టుకొని తరిమేయవా ఈ దూరం

ఉబలాటమున్నదని ఒప్పుకొని అందుకో నా జంట

నీ వేలు పట్టుకొని వదలనని నడపనా నా వెంట

ఆ మాటే చెబుతోంది వెచ్చని నీ శ్వాస

ఓ... ఓ... ఓ... ఓ...

ఓ... ఓ... ఓ... ఓ...

ఏమంటావే ఓ మనసా నీకెందుకే ఇంత ఆశా

ఏమైందని ఓ వయసా మారిందిలా నీ వరస

వరించే కలలొచ్చి వరాలే కురిపించి

స్వరాలై నీతో చేరి పలికేయా ఈ హైలో హైలెస్సా

ఓ... ఆ... ఓ... ఆ... ఓ... ఓ

ఆహా హా... ఓహో హో... ఆహా హా... ఆ... ఆ...


Movie    :  Ninne Ishtapaddanu

Lyrics    :  Sirivennela

Music    :  R P Patnaik

Singers  :  Chitra, S P Balu

Cast     :  Tharun, Sridevi, Anitha

1 comment

  1. I wish to purchase this blog for 50000 rupees. Message me at whatsapp : 7 0 0 1 382516. We can also become partners to earn money from this website.

    Visit my Latest Songs lyrics site: lyrics.1mut.com