Search Suggest

Sayamkala Samayamlo Song Lyrics Download

సాయంకాల సమయములో.. సంధ్య దీపారాధనలో.. వచ్చును తల్లి మహాలక్ష్మి.. వచ్చును తల్లి వరలక్ష్మి.. కాళ్లకు గజ్జెలు కట్టింది.. మేడలో హారం వేసింది.. పిలిచి

సాయంకాల సమయములో..  సంధ్య దీపారాధనలో..

వచ్చును తల్లి మహాలక్ష్మి.. వచ్చును తల్లి వరలక్ష్మి..


కాళ్లకు గజ్జెలు కట్టింది.. మేడలో హారం వేసింది..

పిలిచిన వెంటనే పలికింది.. అడిగినదంతా ఇచ్చింది..

సాయంకాల సమయములో.. సంధ్య దీపారాధనలో..

వచ్చును తల్లి మహాలక్ష్మి.. వచ్చును తల్లి వరలక్ష్మి..


ధనములనిచ్చును ధనలక్ష్మి.. ధాన్యములిచ్చును ధాన్యలక్ష్మి..

వరములనిచ్చును వరలక్ష్మి.. సంతానిమిచ్చును సంతానలక్ష్మి..

||సాయంకాల సమయములో||


అందరు చేరి రారండి.. రకరకాలు పూలు తేరండి..

దేవికి అర్పణ చేయండి.. దేవీ రూపమును చూడండి..

||సాయంకాల సమయములో||


వజ్ర కిరీటం చూడండి.. ముత్యాల హారం చూడండి..

నాగాభరణం చూడండి.. మంగళ రూపం కనరండి..


సాయంకాల సమయములో.. సంధ్య దీపారాధనలో..

వచ్చును తల్లి మహాలక్ష్మి.. వచ్చును తల్లి వరలక్ష్మి..

వచ్చును తల్లి వరలక్ష్మి.. వచ్చును తల్లి వరలక్ష్మి..

Check More Devotional Songs Lyrics

Post a Comment