Search Suggest

Manasuna Edho Raagam Song Lyrics in Telugu (Yentha Vaadu Gaanie)

మనసున ఏదో రాగం విరిసెను నాలో తేజం చెప్పలేని ఏదో భావం నాలో కలిగెలే సంద్రపు అలలే పొంగి తీరం తాకే వేళ

 Manasuna Edho Raagam Lyrics

మనసున ఏదో రాగం విరిసెను నాలో తేజం

చెప్పలేని ఏదో భావం నాలో కలిగెలే

సంద్రపు అలలే పొంగి తీరం తాకే వేళ

మునిగే మనసు అసలు బెదరలేదులే

ఉన్నది ఒక మనసు వినదది నా ఊసు

నను విడి వెళ్ళిపోవుట నేను చూసానే

తియ్యని స్వప్నమిది చెరగని మనోనిధి

కలలో కలలో నను నేనే చూసానే

నాకేం కావాలి నేడు ఒక మాట అడిగి చూడు

ఇక నీవే నాకు తోడు అని లోకమనేదెపుడు


నాకేం కావాలి నేడు ఒక మాట అడిగి చూడు

ఇక నీవే నాకు తోడు అని లోకమనేదెపుడు


దోసిట పూలు తెచ్చి ముంగిట ముగ్గులేసి

మనసును అర్పించగ ఆశ పడ్డానే

వలదని ఆపునది ఏదని అడిగే మది

నదిలో ఆకు వలె కొట్టుకు పోయానే

గరికలు విరులయ్యే మార్పే అందం

ఎన్నో యుగములుగా మెలిగిన బంధం

ఒక వెండి గొలుసు వోలె యీ మనసు ఊగెనిపుడు

తొడగాలి వజ్రమల్లె నే మెరుయుచుంటినిపుడు


ఒక వెండి గొలుసు వోలె  యీ మనసు ఊగెనిపుడు

తొడగాలి వజ్రమల్లె నే మెరుయుచుంటినిపుడు


మనసున ఏదో రాగం విరిసెను నాలో తేజం

చెప్పలేని ఏదో భావం నాలో కలిగెలే

సంద్రపు అలలే పొంగి తీరం తాకే వేళ

మునిగే మనసు అసలు బెదరలేదులే

ఉన్నది ఒక మనసు వినదది నా ఊసు

నను విడి వెళ్ళిపోవుట నేను చూసానే

తియ్యని స్వప్నమిది చెరగని మనోనిధి

కలలో కలలో నను నేనే చూసానే


ఒక వెండి గొలుసు వోలె యీ మనసు ఊగెనిపుడు

తొడగాలి వజ్రమల్లె నే మెరుయుచుంటినిపుడు


Movie Name:   : ఎంతవాడు గాని ..

Music    : Harish Jayaraj

Singer    : చిన్మయి

Post a Comment