Search Suggest

Peniviti Song Lyrics Aravindha Sametha Movie (2018)

Niddarani Irisesi Reppalni Terisnu Song Lyrics In Telugu పెనిమిటీ ఎన్ని నాల్లోయినదో నిను చూసి కల్లారా ఎన్నెన్నిన్నాళ్ళయినదో నిను చూ సి కల్లారా

నిద్దరని ఇరిసేసి రెప్పల్ని తెరిసాను

నువ్వొచ్చే దారుల్లో సుపుల్ని పరిసాను

ఒంటెద్దు బండెక్కి రారా సగిలేటి డొంకల్లో పదిలంగా రారా 

నలిగేటి నామనసు గుర్తొచ్చి రారా గలబోటి కూరొండి పిలిసిన రారా

పెనిమిటీ ఎన్ని నాల్లోయినదో నిను చూసి కల్లారా

ఎన్నెన్నిన్నాళ్ళయినదో నిను చూ సి కల్లారా


చిమ్మాటి చీకటి కమ్మటి సంగటి

ఎర్రగా కుంపటి వెచ్చగా దుప్పటి

కొమ్మలో సక్కటి కోయిలే ఒక్కటి

కొమ్మలో సక్కటి కోయిలే ఒక్కటి

గుండెనే గొంతు చేసి పాడతాంది రా రా పెనిమిటి

గుండెనే గొంతు చేసి పాడతాంది రా రా పెనిమిటి


పొలిమేర దాటి పోయావని 

పొలమారిపోయే నీ దానిని 

కొడవలి లాంటి నిన్ను సంటి వాడిని 

కొంగున దాసుకునే ఆలీ మనసుని 

సుసి సూడక సులకన సెయకు

నా తల రాతలో కలతలు రాయాకు 

తాళిబొట్టు తలుసుకొని తరలి తరలి రా రా పెనిమిటి 

హే తాళిబొట్టు తలుసుకొని తరలి తరలి రా రా పెనిమిటి


నరగోస తాకే కామందువే 

నరగోస తాకే కామందువే

నలపుసవైన  కంటికందవే 

కటికి ఎండలలో కందిపోతివో 

రగతపు సింధులతో తడిసిపోతివో 

యేలకు తింటివో యెట్టనువ్వుంటివో

యేట కట్టి తలగడయి యెడ పండుకుంటివో

నువ్వు గన్న నలుసునైనా తలసి తలసి రారా పెనిమిటి

హే నువ్వు గన్న నలుసునైనా తలసి తలసి రారా పెనిమిటి 


నిద్దరని ఇరిసేసి రెప్పల్ని తెరిసాను

నువ్వొచ్చే దారుల్లో సుపుల్ని పరిసాను

ఒంటెద్దు బండెక్కి రారా సగిలేటి డొంకల్లో పదిలంగా రారా

పెనిమిటీ ఎన్ని నాల్లోయినదో నిను చూసి కల్లారా

ఎన్నెన్నిన్నాళ్ళయినదో నిను చూ సి కల్లారా 


Movie     :  Aravinddha Sametha

Lyrics     :  Ramajogayya Sastry

Music     :  S S Thaman

Singer    :  Kala Bhairava

Cast      :  Jr. NTR, Pooja Hegde

6 comments

  1. Super
  2. Super
  3. మాటలన్నీ ఈ పాట లో వాడేసారు
    మేమేం చెప్పాలి సార్ excellent తప్ప...
  4. యేటా కట్టి కాదు కత్తి అనుకుంటా సర్...
  5. I got a nice practice
  6. Nice song..