Search Suggest

Chilakamma Song Lyrics Gudumba Shankar Movie (2004)

చిలకమ్మ ముక్కుకి దొండపండుకి ఏనాడో రాసి పెట్టుంది కాకమ్మ మూతికి కాకరకాయకి ఆనాడే రాసి పెట్టుంది అరె ఆశే ఉంటే అంతో ఇంతో అంతేనండి మరి రాసే ఉంటే అంతా

చిలకమ్మ ముక్కుకి దొండపండుకి ఏనాడో రాసి పెట్టుంది 

కాకమ్మ మూతికి కాకరకాయకి ఆనాడే రాసి పెట్టుంది 

అరె ఆశే ఉంటే అంతో ఇంతో అంతేనండి 

మరి రాసే ఉంటే అంతా సొంతం అయ్యేనండి 

ఆ వీరబ్రహ్మం ఆనాడిదే అన్నాడండి 

మన పరాబ్రహ్మం మళ్ళీ ఎటు ఉన్నాడండి 

ఉందోయ్ రాసి… లెదోయ్ రాజీ 

చిలకమ్మ ముక్కుకి దొండపండుకి ఏనాడో రాసి పెట్టుంది 

కాకమ్మ మూతికి కాకరకాయకి ఆనాడే రాసి పెట్టుంది 


సన్నాయే విరిగినా ఆ డొలే పగిలినా అయ్యే పెళ్ళాగునా రాసుంటే 

పందిల్లే కూలినా బంధువులే పొయినా అయ్యే పెళ్ళాగునా రాసుంటే 

చల్లే అక్షింతలు నిప్పులే అయినా పెళ్ళాగదు రాసే ఉంటే 

హే మెడ్లో పూమాలలు పాములే ఐనా పెళ్ళాగదు రాసే ఉంటే 

ఉందోయ్ రాసి… వద్దోయ్ పేచీ 

చిలకమ్మ ముక్కుకి దొండపండుకి ఏనాడో రాసి పెట్టుంది 

కాకమ్మ మూతికి కాకరకాయకి ఆనాడే రాసి పెట్టుంది 


తిక్కన్నే వచ్చినా ఎర్రన్నే వచ్చినా జరిగే కథ మారునా రాసుంటే 

గురుడే బోధించినా వరుడే పాటించినా జరిగే కథ మారునా రాసుంటే 

సింహం ఓ పక్క నక్క ఓ పక్క కథ మారదు రాసే ఉంటే 

పెళ్ళాం ఓ పక్క బల్లెమో పక్క కథ మారదు రాసే ఉంటే 

ఉందోయ్ రాసి… బ్రతుకే చీచీ 

అరె ఆశే ఉంటే అంతో ఇంతో అంతేనండి 

మరి రాసె ఉంటే అంతా సొంతం అయ్యేనండి 

ఆ వీరబ్రహ్మం ఆనాడిదే అన్నాడండి 

మన పరాబ్రహ్మం మళ్ళీ ఎటు ఉన్నాడండి 

ఉందోయ్ రాసి… లెదోయ్ రాజీ


Movie    :  Gudumba Shankar

Lyrics    :  Chandrabose

Music    :  Manisharma

Singers  :  Karthik, Sri Vardhini, Hanumantha Rao

Cast     :  Pawan Kalyan, Meera Jasmine

1 comment

  1. సరికొత్త మరియు సూపర్ హిట్ తెలుగు పాటల లిరిక్స్ కోసం క్లిక్ చేయండి



    ఇక్కడ మీరు తెలుగు పాటలకు స్టార్ రేటింగ్(1 - 5) కూడా ఇవ్వొచ్చు.


    ఇంకా మీరు పాడిన పాటలను upload కూడా చేయవచ్చు. మీ వాయిస్ కి వేరే వాళ్ళ rating పొందవచ్చు/// వేరే వాళ్ళ వాయిస్ కు రేటింగ్ ఇవ్వొచ్చు