Search Suggest

Arere Vaanaa Song Lyrics Awara Movie (2010)

అరెరె వాన జడి వాన అందాల నవ్వులే పూల వాన అరెరె వాన జడి వాన అందాల నవ్వులే పూల వాన మళ్ళీ మళ్ళీ వానోస్తే మనసు గొడుగు చెలి పడితే గారం పెరిగింది

అరెరె వాన జడి వాన 

అందాల నవ్వులే పూల వాన 

అరెరె వాన జడి వాన 

అందాల నవ్వులే పూల వాన 

మళ్ళీ మళ్ళీ వానోస్తే మనసు గొడుగు చెలి పడితే 

గారం పెరిగింది దూరం తరిగింది 

ఏమైంది ఏమైంది ఏదేదో జరిగింది 

నెమలి కన్ను లాగ చెలి నాట్యమాడుతుంటే 

ఎదే పాలపుంతై నా మనసునాడమంది 

ఏమైంది ఏమైంది ఏదేదో జరిగింది 

అరెరె వాన జడి వాన 

అందాల నవ్వులే పూల వాన 


ఆటా పాటా ఓ పాడని పాట 

వానే పాడింది అరుదైన పాట 

నిన్ను నన్ను కలిపిన ఈ వానకొక సలాం కొట్టు 

నేను తప్పిపోయాను నీలోన వెతికి పెట్టు 

మంత్రంలాగ ఉంది ఇది తంత్రం లాగ ఉంది 

చిత్రంగానే మదిలో ఒక యుద్దం జరుగుతుంది 

దేవత ఏది నా దేవత ఏది 

తను సంతోషంగా ఆడుతూ ఉంది 


నిన్ను మించి వేరెవరూ లేరే 

నన్ను మించి నీకెవరూ లేరే 

చిన్న చిన్న కళ్ళు రెండు దేవుడు నాకు ఇచ్చాడంట 

కళ్ళు రెండు మూసుకున్నా నీవున్నదే మాయమట 

మల్లెపూల పొద్దు నాకు ఇచ్చి పోవే ముద్దు 

ముద్దు చాటు సద్దు చెరిపేయమంది హద్దు 

పులకించింది ఎద పులకించింది 

చెలి అందాలనే చిలికించింది 

అరెరె వాన జడి వాన 

అందాల నవ్వులే అగ్గి వాన 

అరెరె వాన జడి వాన 

అందాల నవ్వులే అగ్గి వాన 

మళ్ళీ మళ్ళీ వానోస్తే పగటి వేళ మెరుపొస్తే 

నింగే వంగింది భూమే పొంగింది 

నా శ్వాస తగిలాక వణుకు వేడి సోకింది 

గొడుగు పట్టీ ఎవరూ ఈ వాననాపవద్దు 

అడ్డమొచ్చి ఎవరూ నా మనసునాపవద్దు 

ఆడాలి ఆడాలి వానతో ఆడాలి


Movie    :  Awara

Lyrics    :  Vennelakanti

Music    :  Yuvan Shankar Raja

Singers  :  Rahul Nambira, Saindhavi

Post a Comment