Search Suggest

Evvaru Emanna Maradhu Song Lyrics Jayam Movie (2002)

ఎవ్వరు ఏమన్నా మారదు ఈ ప్రేమ ఎవరూ రాకున్నా ఆగదు ఈ ప్రేమ నెత్తుటి కత్తికి ఏనాడూ లొంగదు ఈ ప్రేమ మెత్తని మనసును ఏ రోజు వీడదు ఈ ప్రేమ కులము మతము లేవంటు

ఎవ్వరు ఏమన్నా మారదు ఈ ప్రేమ

ఎవరూ రాకున్నా ఆగదు ఈ ప్రేమ

నెత్తుటి కత్తికి ఏనాడూ లొంగదు ఈ ప్రేమ

మెత్తని మనసును ఏ రోజు వీడదు ఈ ప్రేమ

కులము మతము లేవంటుంది మనసుకి ఈ ప్రేమ

నింగీ నేల ఉన్నన్నాళ్ళు ఉంటుందీ ప్రేమ

ఎవ్వరు ఏమన్నా మారదు ఈ ప్రేమ

ఎవరూ రాకున్నా ఆగదు ఈ ప్రేమ


కాలమొస్తే సిరిమల్లె తీగకి చిగురే పుడుతుంది

ఈడు వస్తే ఈ పడుచు గుండెలో ప్రేమ పుడుతుంది

గొడుగు అడ్డుపెట్టినంతనే వాన జల్లు ఆగిపోవునా

గులకరాయి వేసినంతనే వరద జోరు ఆగిపోవునా

ఏడు లోకాలు ఏకం అయినా ప్రేమను ఆపేనా

ఎవ్వరు ఏమన్నా మారదు ఈ ప్రేమ

ఎవరూ రాకున్నా ఆగదు ఈ ప్రేమ


ప్రేమ అంటే ఆ దేవుడిచ్చిన చక్కని వరమంట

ప్రేమ ఉంటే ఈ మనసుకెప్పుడూ అలుపే రాదంట

కండలెంత పెంచుకొచ్చినా కొండనెత్తి దించలేరుగా

కక్షతోటి కాలు దువ్వినా ప్రేమనెవ్వరాపలేరుగా

ప్రేమకెపుడైనా జయమే కానీ ఓటమి లేదంట 

ఎవ్వరు ఏమన్నా మారదు ఈ ప్రేమ

ఎవరూ రాకున్నా ఆగదు ఈ ప్రేమ

నెత్తుటి కత్తికి ఏనాడూ లొంగదు ఈ ప్రేమ

మెత్తని మనసును ఏ రోజు వీడదు ఈ ప్రేమ

కులము మతము లేవంటుంది మనసుకి ఈ ప్రేమ

నింగీ నేల ఉన్నన్నాళ్ళు ఉంటుందీ ప్రేమ

శాశ్వతమీ ప్రేమ... 


Movie   :  Jayam

Lyrics   :  Kulasekhar

Music   :  R P Patnaik

Singers:  R P Patnaik, Usha

Post a Comment