Search Suggest

Padanaa thiyaga kammani okapata song lyrics in telugu

పాడనా తీయగా కమ్మని ఒకపాట నీ జ్ఞాపకాలే నన్నే తరిమెనే song lyrics in telugu

పాడనా తీయగా కమ్మని ఒకపాట

నీ జ్ఞాపకాలే నన్నే తరిమెనే

నీకోసం నేనే పాటై మిగిలానే

చెలియా చెలియా... ఓ... చెలియా...


పాడనా తీయగా కమ్మని ఒకపాట

పాటగా బతకనా మీ అందరినోట

ఆరాధనే అమృతవర్షం అనుకున్నా

ఆవేదనే హాలాహలమై పడుతున్నా

నా గానమాగదులే ఇక నా గానమాగదులే ||పాడనా||


గుండెల్లో ప్రేమకే...

గుండెల్లో ప్రేమకే గుడి కట్టేవేళలో

తనువంతా పులకించే

వయసంతా గిలిగింతే

ప్రేమించే ప్రతిమనిషీ ఇది పొందే అనుభూతే

అనురాగాల సారం జీవితమనుకుంటే

అనుబంధాల తీరం ఆనందాలుంటే

ప్రతి మనసులో కలిగే భావం ప్రేమేలే ||2|| ||పాడనా||


ఆకాశం అంచులో...

ఆకాశం అంచులో ఆవేశం చేరితే

అభిమానం కలిగెనులే

అపురూపం అయ్యెనులే

కలనైనా నిజమైనా కనులెదుటే ఉన్నావే

కలువకు చంద్రుడు దూరం... ఓ నేస్తం

కురిసే వెన్నెల వేసే ఆ బంధం

ఈ విజయం వెనుక ఉన్నది నీవేలే ||2|| ||పాడనా||

 

Post a Comment