Search Suggest

Laali Laali Song Lyrics Swathi Mutyam Movie (1986)

లాలీ లాలీ లాలీ లాలీ లాలీ లాలీ లాలీ లాలీ వటపత్రశాయికి వరహాల లాలి రాజీవ నేత్రునికి రతనాల లాలి వటపత్రశాయికి వరహాల లాలి రాజీవ నేత్రునికి రతనాల
1 min read

లాలీ లాలీ లాలీ లాలీ 

లాలీ లాలీ లాలీ లాలీ 

వటపత్రశాయికి వరహాల లాలి 

రాజీవ నేత్రునికి రతనాల లాలి 

వటపత్రశాయికి వరహాల లాలి 

రాజీవ నేత్రునికి రతనాల లాలి 

మురిపాల కృష్ణునికి..ఆ...... 

మురిపాల కృష్ణునికి ముత్యాల లాలి 

జగమేలు స్వామికి పగడాల లాలి 

వటపత్రశాయికి వరహాల లాలి 

రాజీవ నేత్రునికి రతనాల లాలి 

లాలీ లాలీ లాలీ లాలీ 

లాలీ లాలీ లాలీ లాలీ 


కల్యాణ రామునికి కౌసల్య లాలి 

కల్యాణ రామునికి కౌసల్య లాలి 

యదువంశ విభునికి యశోద లాలి 

యదువంశ విభునికి యశోద లాలి 

కరిరాజ ముఖునికి........... 

కరిరాజ ముఖునికి గిరి తనయ లాలి 

కరిరాజ ముఖునికి గిరి తనయ లాలి 

పరమాంశభవునికి పరమాత్మ లాలి 

వటపత్రశాయికి వరహాల లాలి 

రాజీవ నేత్రునికి రతనాల లాలి 


జోజో జోజో జో.......... 

జోజో జోజో జో..........

అలమేలు పతికి అన్నమయ్య లాలి 

అలమేలు పతికి అన్నమయ్య లాలి 

కోదండరామునికి గోపయ్య లాలి 

కోదండరామునికి గోపయ్య లాలి 

శ్యామలాంగునికి శ్యామయ్య లాలి 

శ్యామలాంగునికి శ్యామయ్య లాలి 

అగమనుతునికి త్యాగయ్య లాలి 

వటపత్రశాయికి వరహాల లాలి 

రాజీవ నేత్రునికి రతనాల లాలి

మురిపాల కృష్ణునికి ముత్యాల లాలి 

జగమేలు స్వామికి పగడాల లాలి 

వటపత్రశాయికి వరహాల లాలి 

రాజీవ నేత్రునికి రతనాల లాలి 

లాలీ లాలీ లాలీ లాలీ 

లాలీ లాలీ లాలీ లాలీ 


Movie    :  Swathi Mutyam

Lyrics    :  C Narayana Reddy

Music    :  Ilayaraja

Singer   :  P Susheela

3 comments

  1. 5 years
    Agamanuthuniki ante artham cheppagalara please
    1. 4 years
      రాముడు
    2. 12 month
      Vishnu is the Supreme Lord in the Pancharatra Agamas