పల్లవి:
మనసుల మనసుంటలేదు
వయసు మాట ఇంట లేదు
కడుపుల కూడుంటలేదు
కనులకు కునుకైనా రాదు
నా రోకంత నీ మీదే జాను
నువ్వు లేకుంటే నేనేమైపోను
నా రోకంత నీ మీదే జాను
నువ్వు లేకుంటే నేనేమైపోను
నీ యేన్నెల ఈడును జూసి
మందిల సైగాలు చేస్తే
సందుల సాటుకు వచ్చి సీకటి సోకులు చేసే
అందరిలాంటి దానను కాను నా జోలికొస్తే నేనురుకోను
అందరిలాంటి దానను కాను నా జోలికొస్తే నేనురుకోను
చరణం:1
కన్నోళ్లే కాదనన్న కులపోల్లే కావాలున్న
తొడగొట్టి సేప్పుతున్న నీ నుదుట బోట్టునైత ఈగ అద్దంటే ఆగేదే లేదు
అల్లు అర్జున్ లా తగ్గేదే లేదు
అద్దంటే ఆగేదే లేదు
అల్లు అర్జున్ లా తగ్గేదే లేదు
మూడు పూట ముచ్చట్లు
ఎన్ని చూస్తాలే నేడు వాడుకొని వదిలేసే నీలాంటి మగవాళ్ళు
దమ్ముంటే మా వోళ్లతో సారు
అంత సీనుంటే మాట్లాడి సూడు
దమ్ముంటే మా వోళ్లతో సారు
అంత సీనుంటే మాట్లాడి సూడు
చరణం:2
నువ్వు లేని నా గుండె ఆగిపోతా అంటుందే
నిను పొందని నా జన్మే మల్ల పుట్టనంటుందే
చల్ యేట్లయితే అట్లయే జాను
మీ వోళ్ళతోనే మాట్లాడుతాను
యేట్లయితే అట్లయే జాను
మీ వోళ్ళతోనే మాట్లాడుతాను
పిల్లగా సిగ్గు లేక రమ్మంటే
ఇంటికొస్తావా ఇంతే ఎవలైన చూసనంటే నెత్తినిందలు అంతే
రామా దండాలు నీకు సామి
రాసిపెట్టుంటే అయితదిలే పెండ్లి
రామా దండాలు నీకు సామి
రాసిపెట్టుంటే అయితదిలే పెండ్లి
చరణం:3
ఒక్కసారి సోపతయితే సచ్చేదాకా ఇడిసిపోను
నమ్మబుద్ధి కాకపోతే గుండె కోసి ప్రేమ జూడు
అబ్బా నువ్వే నా జీవితమే జాను
జన్మ జన్మలదే మన అనుబంధము
నువ్వే నా జీవితమే జాను
జన్మ జన్మలదే మన అనుబంధము
మూలకున్న దాన్ని నన్ను ముగ్గులోకి దింపినావు
మందిలున్న మనసునంతా ముంచి ముద్ద చేసినావు
ఇగ నుండి నువ్వే నా షాను
దుమ్ము దులిపేద్దాం రా దునియాను
ఇగ నుండి నువ్వే నా షాను
ఏది ఏమైనా నీతో నే నేను
LYRICS : RAGHU NIMMALA
SINGERS - SUMAN BHADANAKAL - SRINIDHI
MUSIC - KALYAN KEY'S
CAST - DJ SAGAR -YAMUNA TARAK
PRODUCTION - VEERA BHAI