శ్రీలు పొంగిన జీవగడ్డయి
శ్రీలు పొంగిన జీవగడ్డయి
పాలు పారిన భాగ్యసీమయి
వ్రాలినది ఈ భరతఖండము
భక్తిపాడరా తమ్ముడా
వేద శాఖలు వెలసెనిచ్చట
ఆది కావ్యం బలరె నిచ్చట
బాదరాయణ పరమఋషులకు
పాదు సుమ్మిది చెల్లెలా
విపిన బంధుర వృక్షవాటిక
ఉపనిషన్మదువోలికేనిచ్చట
విపుల తత్వము విస్తరించిన
విమల తలమిది తమ్ముడా
పాండవేయుల పదనుకత్తుల
మండి మెరసిన మహితరణకధ
పండగల చిక్కని తెలుంగుల
కలిపి పాడవే చెల్లెలా
దేశగర్వము దీప్తి చెందగ
దేశ చరితము తేజరిల్లగ
దేశమరిసిన ధీరపురుషుల
తెలిసి పాడరా తమ్ముడా
లోకమంతకు కాక బెట్టిన
కాకతీయుల కదనపాండితి
చీకిపోవని చేవపదముల
చేర్చి పాడవె చెల్లెలా
తుంగభద్రా భంగములతో
పొంగి నింగిని బొడిచి త్రిళ్లి
భంగపడని తెలుంగునాధుల
పాటపాడరా తమ్ముడా
మేలి కిన్నెర మేళవించి
రాలు గరగగ రాగమెత్తి
పాలతియని బాలభారత
పధము పాడవె చెల్లెలా