Search Suggest

కళ్లు కళ్లు ప్లస్సూ... వాళ్లు వీళ్లు మైనస్ (KALLU KALLU PLUSSU VALLU VILLU MINUSS) SONG LYRICS IN TELUGU

కళ్లు కళ్లు ప్లస్సూ... వాళ్లు వీళ్లు మైనస్ SONGS LYRICS IN TELUGU

కళ్లు కళ్లు ప్లస్సూ... వాళ్లు వీళ్లు మైనస్

ఒళ్లు ఒళ్లు ఇన్‌టు చేసేటి ఈక్వేషన్

ఇలా ఇలా ఉంటే ఈక్వల్‌టు

ఇన్‌ఫ్యాట్యుయేషన్

॥కళ్లు॥


అనుపల్లవి :

ఎడమభుజము కుడిభుజము కలిసి

ఇక కుదిరే కొత్త త్రిభుజం

పడుచు చదువులకు గణిత సూత్రమిది

ఎంతో సహజం

సరళరేఖలిక మెలిక తిరిగి పెనవేసుకున్న చిత్రం

చర్య జరిగి ప్రతిచర్య పెరిగి పుడుతుందో ఉష్ణం

॥కళ్లు॥

ఇన్‌ఫ్యాట్యుయేషన్... ఇన్‌ఫ్యాట్యుయేషన్...


చరణం : 1

దూరాలకి మీటర్‌లంట భారాలకి కేజీలంట

కోరికలకి కొలమానం ఈ జంట

సెంటీగ్రేడ్ సరిపోదంట

ఫారెన్ హీట్ పనిచేయదంట

వయసు వేడి కొలవాలంటే తంటా

లేత లేత ప్రాయాలలోన అంతేలేని ఆకర్షణ

అర్థం కాదు ఏ సైన్స్‌కైనా... ఓ...

పైకి విసిరినది కింద పడును

అని తెలిపే గ్రావిటేషన్

పైన కింద తలకిందులౌతది

ఇన్‌ఫ్యాట్యుయేషన్

॥కళ్లు॥


చరణం : 2

సౌత్ పోల్ అబ్బాయంట

నార్త్ పోల్ అమ్మాయంట

రెండు జంట కట్టే తీరాలంట

ధనావేశం అబ్బాయంట

ఋణావేశO అమ్మాయంట

కలిస్తే కరెంటే పుట్టేనంట

ప్రతిస్పర్శ ప్రశ్నేనంటా మరో ప్రశ్న జవాబట

ప్రాయానికే పరీక్షలంట... ఓ...

పుస్తకాల పురుగులు రెండంట ఈడుకొచ్చెనంట

అవి అక్షరాల చక్కెర తింటూ మైమరచేనంట

॥కళ్లు॥


Post a Comment