చిరుగాలి వీచెనే...చిగురాశ రేపెనే
చిరుగాలి వీచెనే...
చిగురాశ రేపెనే
వెదురంటి మనసులో రాగం వేణు ఊదెనే
మేఘం మురిసి పాడెనే
కరుకైన గుండెలో..చిరుజల్లు కురిసెనే..
తనవారి పిలుపులో
ఆశలు వెల్లువాయెనే..ఊహలు ఊయలూపెనే..
ఆశలు వెల్లువాయెనే..ఊహలు ఊయలూపెనే..
చినుకు రాక చూసి మది చిందులేసెనే..
చిలిపితాళమేసి చెలరేగి పోయెనే..
చిరుగాలి వీచెనే...
చిగురాశ రేపెనే
వెదురంటి మనసులో రాగం వేణు ఊదెనే
మేఘం మురిసి పాడెనే
తుళ్ళుతున్న చిన్ని సెలయేరు
గుండెలోన పొంగి పొలమారు
అల్లుకున్న ఈ బంధమంతా
వెల్లువైనదీ లోగిలంతా
పట్టెడన్నమిచ్చి పులకించే
నేలతల్లివంటి మనసల్లే
కొందరికే హౄదయముందీ
నీకొరకే లోకముందీ
నీకూ తోడు ఎవరంటు లేరూ గతములో
నేడు చెలిమికై చాపే,ఆరే బ్రతుకులో
కలిసిన బంధం , కరిగిపోదులే
మురళి మోవి,విరివి తావి కలిసిన వేళా
చిరుగాలి వీచెనే...
చిగురాశ రేపెనే
వెదురంటి మనసులో రాగం వేణు ఊదెనే
మేఘం మురిసి పాడెనే
మనసున వింత ఆకాశం
మెరుపులు చిందె మనకోసం
తారలకే తళుకు బెళుకా
ప్రతి మలుపూ ఎవరికెరుకా
విరిసిన ప్రతి పూదోటా
కోవెల ఒడి చేరేనా
ౠణమేదో మిగిలి ఉందీ
ఆ తపనే తరుముతోందీ
రోజూ ఊహలే ఊగే,రాగం గొంతులో
ఏవో పదములే పాడే,మోహం గుండెలో
ఏనాడూ తోడు లేకనే
కడలి ఒడిని చేరుకున్న గోదారల్లే
కరుకైన గుండెలో....చిరుజల్లు కురిసెనే
తనవారి పిలుపులో...
ఆశలు వెల్లువాయెనే,ఊహలు ఊయలూపెనే
ఆశలు వెల్లువాయెనే,ఊహలు ఊయలూపెనే
చినుకు రాక చూసి మది చిందులేసెనే
చిలిపితాళమేసి చెలరేగి పోయెనే..