Search Suggest

Akuchatu pindhe thadise kokamatu pilla thadise song lyrics in telugu

ఆకు చాటు పిందె తడిసే కోక మాటు పిల్ల తడిసే song lyrics in telugu

ఆకు చాటు పిందె తడిసే కోక మాటు పిల్ల తడిసే

 

ఆకు చాటు పిందె తడిసే కోక మాటు పిల్ల తడిసే

ఆకు చాటు పిందె తడిసే కోక మాటు పిల్ల తడిసే

ఆకాశగంగొచ్చింది అందాలు ముంచెత్తింది

గోదారి పొంగొచ్చిందీ కొంగుల్ని ముడిపెత్తింది

గూడు చాటు గువ్వ తడిసే గుండె మాటు గుట్టు తడిసే

గూడు చాటు గువ్వ తడిసే గుండె మాటు గుట్టు తడిసే

ఆకాశగంగొచ్చింది అందాలు ముంచెత్తింది

గోదారి పొంగొచ్చింది కొంగుల్ని ముడిపెత్తింది


ముద్దిచ్చి ఓ చినుకు ముత్యమై పోతుంటే

అహ అహ అహాహ

చిగురాకు పాదాల సిరిమువ్వలవుతుంటే

అహ అహ అహ అహ

ఓ చినుకు నిను తాకి తడి ఆరి పోతుంటే

ఓ చినుకు నిను తాకి తడి ఆరి పోతుంటే

ఓ చినుకు నీ మెడలో నగ లాగ నవుతుంటే

నీ మాట విని మబ్బు మెరిసి అహ జడివానలే కురిసి కురిసి

వళ్ళు తడిసి వెల్లి విరిసి వలపు సరిగంగ స్నానాలు చెయ్యాలి

అహ అహ ఆహ అహ అహ ఆహ


మైమరచి ఓ మెరుపు నిన్నల్లుకుంటుంటే

అహ అహ అహ అహ

ఎదలోన ఓ మెరుపు పొదరిల్లు కడుతుంటే

అహ అహ అహా అహ

ఓ మెరుపు నీ చూపై ఉరిమేసి రమ్మంటే

ఓ మెరుపు నీ నవ్వై నన్నే నమిలేస్తుంటే

అహ నీ పాట విని మెరుపులొచ్చి

అహ నీ విరుపులే ముడుపు లిచ్చి

చలిని పెంచి చెలిమి పంచి తనలో వెచ్చంగా తడి ఆర్చుకోవాలి

అహ అహ ఆహ అహ అహ ఆహ

 


Post a Comment