Search Suggest

Meghama Maruvake Song Lyrics in Telugu from Seetharatnam Gari Abbayi Movie

మేఘమా మరువకే.. మోహమా విడువకే.. మాఘమాస వేళలో.. మల్లెపూల మాలగా మరుని కూడి మెల్లగా.. మరలి రావే చల్లగా మదిలో మెదిలే మధువై..

Meghama Maruvake Song Lyrics

 

మేఘమా మరువకే.. మోహమా విడువకే..

మాఘమాస వేళలో.. మల్లెపూల మాలగా

మరుని కూడి మెల్లగా.. మరలి రావే చల్లగా

మదిలో మెదిలే మధువై..


మేఘమా మరువకే.. మోహమా విడువకే..


నిదుర కాచిన కన్నె పానుపే .. రారా రమ్మంటుంటే..!

కురులు విప్పిన అగరఒత్తులే.. అలకలు సాగిస్తుంటే

సిగ్గే ఎరుగని రేయిలో.. తొలి హాయిలో అలివేణి

రవికే తెలియని అందము.. అందించనా నెలరాజా

కలలా.. అలలా.. మెరిసి..


మేఘమా మరువకే.. మోహమా విడువకే..


గడుసు ఒడుపులే.. పరుపు విరుపులై గిచ్చే సందడిలోన

తడవ తడవకి పెరుగుతున్నది.. ఏదో మైకం భామా

మరుగే ఎరుగని కోనలో.. ఆ మోజులో మహరాజా

నలిగే మల్లెల సవ్వడి.. వినిపించనా నెరజాణ

జతగా.. కలిసి.. అలిసీ..


మేఘమా మరువకే.. మోహమా విడువకే..

Movie: Seetharatnam Gari Abbayi (03 September 1992)

Singers: S P Balasubramanyam, KS Chitra

Music: Raj-Koti

Lyrics: Bhuvana Chandra

Post a Comment