ఇదే కదా ఇదే కదా నీ కథ
ముగింపు లేనిదై సదా సాగదా
ఇదే కదా ఇదే కదా నీ కథ
ముగింపు లేనిదై సదా సాగదా
నీ కంటి రెప్పలంచున మనస్సు నిండి పొంగినా
ఓ నీటి బిందువే కదా నువ్వెతుకుతున్న సంపద
ఒక్కొక్క జ్ఞాపకానికి వందేళ్ళ ఆయువుందిగా
ఇంకెన్ని ముందు వేచెనో అవన్ని వెతుకుతూ పదా...
మనుష్యులందు నీ కథ... మహర్షిలాగ సాగదా...
మనుష్యులందు నీ కథ... మహర్షిలాగ సాగదా...
ఇదే కదా ఇదే కదా నీ కథ
ముగింపు లేనిదై సదా సాగదా
ఇదే కదా ఇదే కదా నీ కథ
ముగింపు లేనిదై సదా సాగదా
నిస్వార్థమెంత గొప్పదో…
నీ పదము రుజువు కట్టదా..
సిరాలు లక్ష ఓంపొద
చిరాక్షరాలు రాయదా
నిశీధి ఎంత చిన్నదో
నీ కంటి చూపు చెప్పదా..
నీలోని వెలుగు పంచగా..
విశాల నింగి చాలదా..
మనుష్యులందు నీ కథ... మహర్షిలాగ సాగదా...
మనుష్యులందు నీ కథ... మహర్షిలాగ సాగదా...
Movie : Maharshi
Lyrics : Shree Mani
Music : Devi Sri Prasad
Singer : Vijay Prakash
Cast : Mahesh Babu, Pooja Hegde