Search Suggest

Jai Veeranjaneya Song Lyrics Idiot Movie (2002)

జై ఈరాంజనేయా..ఎయ్ దీంతస్సదియ్యా దుమ్మురేపే దమ్మువుందీ సూపులోనా సురుకున్నదిరో పంబరేపెయ్ కుర్రోడా బెండుతీసెయ్ సిన్నోడా సెడుగుడు ఆడెయ్ బుల్లోడా...

జై ఈరాంజనేయా..ఎయ్ దీంతస్సదియ్యా

దుమ్మురేపే దమ్మువుందీ 

సూపులోనా సురుకున్నదిరో

పంబరేపెయ్ కుర్రోడా

బెండుతీసెయ్ సిన్నోడా

సెడుగుడు ఆడెయ్ బుల్లోడా...

నిప్పులు సెరిగే సూరీడా

పేమలోపడితే కష్టాలుంటాయ్

కష్టాలున్నప్పుడు కన్నీళ్ళొస్తాయి

ఈ కష్టాలూ కన్నీళ్ళూ మనకెందుకులే అనుకొని

ప్రేమించడం మానేస్తే

గొడ్డుకీ మనిషికి పెద్దతేడా ఏముంటుందిరో

గుప్పెడు గుండెను తట్టిందా

ఉప్పెనలాంటి ఈ పేమా

ఎనకడుగేస్తే దక్కేనా వన్నేసిన్నెలా ఈ బామా

తల్లిని ప్రేమిస్తాడొకడు పిల్లిని ప్రేమిస్తాడొకడు

అక్కని ప్రేమిస్తాడొకడు కుక్కని ప్రేమిస్తాడొకడు

అలాంటప్పుడు నువ్వీ పిల్లని పేమిస్తే తప్పేమిటిరో

ప్రాణంగా నువ్ పేమిస్తే ముందూ ఎనకా సూడకురో

అడ్డం వస్తే ఎవడైనా తాడోపేడో తేల్చెయ్ రో....


ఓరోరి కుర్రోడో...ఆ పిల్ల నీదేరో.....

సీమంటూ కుట్టాకా సిర్రెత్తుకొస్తాదీ

ప్రేమంటూ పుట్టిందా ఏదేదో అవుతాది

ప్రేమేగానయ్యిందంటే 

సచ్చేదాకా అసలే వొదలదురోయి

ఇడదీయాలనుకుంటున్నా

అయ్యెరామా ఇంచె కదలదురోయి

పెద్దోళ్ళా ఏడుపుసూసీ కరగొద్దూ ముద్దులకన్నా

అయ్యయ్యే అన్నావంటే నీ పేమే నిండుసున్నా


పేమించుకోవయ్యే.. తప్పేమికాదయ్యె

నవాబు గరీబు తేడాలే లేవంటూ

ఆనాడు ఈ నాడు గెలిచేదే ప్రేమంటా

లోకంలో అన్నిటికన్నా

అద్దిరిబన్నా ప్రేమ గొప్పదిరోయి

కుర్రోడూ ముసలోడైనా

ఎప్పటికైనా ప్రేమలో పడతాడోయి

ప్రేమిస్తే సరిపోదన్నా ప్రాణాలే ఇచ్చెయ్యాలీ

అదికూడాకాదంటావా ప్రాణాలే తీసెయ్యాలీ


ఇటుసూడు బెమ్మయ్యె ..... ఇతగాడి జోరయ్యో

ప్రేమించే పిల్లాడూ ఎదిరించీ నిలిచాడూ

ప్రేమిస్తే ఇట్టాగే పోరాడాలన్నడూ

సుడిగుండాలెన్నెదురైనా

బిత్తరపోకా ఒడ్దుకు సేరాలోయి

బుసకొట్టే పాములువున్నా

తత్తరపడకా బరిలో గెలవాలొయి

అన్నన్నా ఓరన్నా ...నిప్పయ్యీ రేగాలన్నా

ఎదురింకాలేదన్నా గెలిచేదీ నువ్వేరన్నా....


అన్నన్నా ఓరన్నా ...నిప్పయ్యీ రేగాలన్నా

ఎదురింకాలేదన్నా గెలిచేదీ నువ్వేరన్నా.... 


అన్నన్నా ఓరన్నా ...నిప్పయ్యీ రేగాలన్నా

ఎదురింకాలేదన్నా గెలిచేదీ నువ్వేరన్నా.... 


Movie    :  Idiot

Lyrics    :  Bhaskara Bhatla

Music    :  Chakri

Singer   :  Raghu Kunche

Cast     :  Ravi Teja, Rakshitha

Post a Comment