Search Suggest

Dolu Baja Song Lyrics Yogi Movie (2006)

శివాయ నమ ఓం.. శివాయ నమ ఓం.. శివాయ నమ ఓం.. డోలు బాజా ఆటల్లో నీవే మేటివంట శివశంకరా ఈల వేసి గగ్గోలు చేసే ఆట నాది దీవించరా కాళేశ్వరా అరె నీ కాలిఅందే

శివాయ నమ ఓం.. శివాయ నమ ఓం.. శివాయ నమ ఓం.. 

డోలు బాజా ఆటల్లో నీవే మేటివంట శివశంకరా 

ఈల వేసి గగ్గోలు చేసే ఆట నాది దీవించరా 

కాళేశ్వరా అరె నీ కాలిఅందే భాగ్యమేదో నాకివ్వరా 

నీ ముందు నేను చిందేసే యోగం రోజు నాకు అందించరా 

అహ ముక్కంటి నువే దిక్కంటి.. 

శివ మా ఇంటిలోనే నువ్వుంటే చాలు రా రా గౌరీ ప్రాణేశ్వరా 

ఇక నా గుండె కాదా నీ వెండి కొండ ఉండిపోరా లోకేశ్వరా 

డోలేరే… డోలేరే… డోలేరే… 

హే.. నీ శిరస్సుపైన ఏమున్నది చందమామ వెలుగున్నది 

నీ గొంతుపైన ఏమున్నది నీలి రంగు నీడున్నది 

అరె డం డం డం డమరుకములు చెప్పాయి నీలో వెలుగు నీడ కలిసున్నది 

హే.. దగ్ దగ్ దగ్ కుదుపు భయము ఉండొద్దు అంటూ నీలో ఉన్నా సత్యాన్ని కంటున్నా 

ముక్కంటి నువే దిక్కంటి.. 

శివ మా ఇంటిలోనే నువ్వుంటే చాలు రా రా గౌరీ ప్రాణేశ్వరా 

ఇక నా గుండె కాదా నీ వెండి కొండ ఉండిపోరా లోకేశ్వరా 

హర హర మహాదేవ శివ శంకర హర హర మహాదేవ శివ శంకర

హర హర మహాదేవ శివ శంకర హర హర మహాదేవ శివ శంకర 

హే.. నీ కంటిలోన నిప్పున్నది భగ్గుమంటే బొగ్గయితది 

ఆ అగ్గినాపేదేమున్నది గంగ నీకు తోడున్నది 

అరె భం భం భం సదరుగుణము అంటుంది నీలో నీరు నిప్పు కూడున్నది 

మరి ఘం ఘం మనిషి మనిషి కలిసుండాలంటూ 

నీవు చెప్పే వేదాన్ని వింటున్నా శంభో.. శివశంభో… 

శివ మా ఇంటిలోనే నువ్వుంటే చాలు రా రా గౌరీ ప్రాణేశ్వరా 

ఇక నా గుండె కాదా నీ వెండి కొండ ఉండిపోరా లోకేశ్వరా 

డోలు బాజా ఆటల్లో నీవే మేటివంట శివశంకరా 

ఈల వేసి గగ్గోలు చేసే ఆట నాది దీవించరా 

కాళేశ్వరా అరె నీ కాలిఅందే భాగ్యమేదో నాకివ్వరా

నీ ముందు నేను చిందేసే యోగం రోజు నాకు అందించరా 

అహ ముక్కంటి నువే దిక్కంటి.. 

శివ మా ఇంటిలోనే నువ్వుంటే చాలు రా రా గౌరీ ప్రాణేశ్వరా 

ఇక నా గుండె కాదా నీ వెండి కొండ ఉండిపోరా లోకేశ్వరా 

హర హర మహాదేవ శివ శంకర హర హర మహాదేవ శివ శంకర

హర హర మహాదేవ శివ శంకర హర హర మహాదేవ శివ శంకర 

హర హర మహాదేవ శివ శంకర హర హర మహాదేవ శివ శంకర

హర హర మహాదేవ శివ శంకర హర హర మహాదేవ శివ శంకర 

డోలేరే… డోలేరే… డోలేరే…

Movie    :  Yogi

Lyrics    :  Suddhala Ashok Teja

Music    :  Ramana Gogula

Singer   :  Shankar Mahadevan

Post a Comment