Search Suggest

Koila Paata Bagunda Song Lyrics Ninne Premistha Movie (2000)

కోయిల పాట బాగుందా కొమ్మలసడి బాగుందా పున్నమితోట బాగుందా వెన్నెల సిరి బాగుందా కోయిల పాట బాగుందా కొమ్మలసడి బాగుందా పున్నమితోట బాగుందా వెన్నెల సిరి బాగ

కోయిల పాట బాగుందా కొమ్మలసడి బాగుందా

పున్నమితోట బాగుందా వెన్నెల సిరి బాగుందా

కోయిల పాట బాగుందా కొమ్మలసడి బాగుందా

పున్నమితోట బాగుందా వెన్నెల సిరి బాగుందా

అందమైన మల్లె బాల బాగుందా అల్లి బిల్లి మేఘమాల బాగుందా

చిలకమ్మా చెప్పమ్మా చిరుగాలి చెప్పమ్మా

కోయిల పాట బాగుందా కొమ్మలసడి బాగుందా

పున్నమితోట బాగుందా వెన్నెల సిరి బాగుందా


అప్పుడిప్పుడు గున్నమామి తోటలో అట్లతద్ది ఊయలూగినట్లుగా

ఇప్పుడెందుకో అర్థరాత్రి వేళలో గుర్తుకొస్తోంది కొత్త కొత్తగా

నిదురించిన ఎద నదిలో అల లెగిసిన అలజడిగా

తీపితీపి చేదు ఇదా లేతపూల ఉగాది ఇదా

చిలకమ్మా చెప్పమ్మా చిరుగాలి చెప్పమ్మా

కోయిల పాట బాగుందా కొమ్మలసడి బాగుందా

పున్నమితోట బాగుందా వెన్నెల సిరి బాగుందా


మబ్బు చాటులో ఉన్న వెన్నెలమ్మకి బుగ్గచుక్కలాగా ఉన్న తారక

కొబ్బరాకుతో అల్లుకున్న బొమ్మకి పెళ్లి చుక్కపెట్టినట్టు వుందిగా

కలలుకనే కన్నులలో కునుకెరుగని కలవరమా

రేయిలోని పలవరమా హాయిలోని పరవశమా

చిలకమ్మా చెప్పమ్మా చిరుగాలి చెప్పమ్మా

కోయిల పాట బాగుంది కొమ్మల సడి బాగుంది

పున్నమితోట బాగుంది వెన్నెలసిరి బాగుంది

అందమైన మల్లె బాల బాగుంది అల్లి బిల్లి మేఘమాల బాగుంది

చిలకమ్మా బాగుంది చిరుగాలి బాగుంది

కోయిల పాట బాగుంది కొమ్మల సడి బాగుంది

పున్నమితోట బాగుంది వెన్నెలసిరి బాగుంది


Movie    :  Ninne Premistha 

Lyrics    :  Sirivennela 

Music    :  S A Rajkumar 

Singers  :  S P Balu, Chitra

Cast     :  Nagarajuna, Srikanth, Soundarya

4 comments

  1. Good song I loved it
  2. Wonderful lyrics by Sirivennela garu & Superb album by S.A.Rajkumar!
  3. All time hit song
  4. The best lyrics and my fav song