Search Suggest

pavurama pavurama premaku nuvve cheerunama song lyrics in telugu from vidudhala -2, vijay sethupathi

The song, written by Kasarla Shyam, has been received with great enthusiasm by Telugu audiences. With the performances of Vijay Sethupathi &Manju
pavurama pavurama premaku nuvve cheerunama song lyrics in telugu from vidudhala -2, vijay sethupathi


పావురమా పావురమా

ప్రేమకు నువ్వే చిరునామా

పావురమా పావురమా

ప్రేమకు నువ్వే చిరునామా


నీ తెలుపు నా ఎరుపు

ఒక్కటయ్యే కల కనలేమా

చెమటకు కూడా మనసుంది

చేమంతికి అది తెలిసింది

నా చిన్ని గుండెను కలిసింది

కొత్త కొత్త దారులు తెరిచింది


పావురమా పావురమా

ప్రేమకు నువ్వే చిరునామా


పావురమా… ఆ


దూరమెంతో చిన్నముల్లు

పెద్దముల్లుకే దగ్గరైతే

మోగే గంటలు ప్రేమలకే


మన్ను చూసి చెయ్యే చాచి

ఆ మబ్బులే ఓ చినుకే

వేసేనట బంధాలే

చెట్టు పైనున్న చిట్టి చిలకమ్మ

చేపతో జంట ఎట్ట కుదిరేనమ్మా


నా పాట నాకే పాడావేటి

నా మాట నాకేలనే


చుట్టు చూస్తే నువ్వే తప్ప

వేరే నాకు లేనే లేరు

తీయనైన రాగమేదో తీయనివా


పావురమా పావురమా

ప్రేమకు నువ్వే చిరునామా


పావురమా … ఆ


చల్లగాలి మెల్ల మెల్లగా వీస్తుంటే

నా వెనకే నువ్వున్నట్టుగా తోచిందే

ప్రతి చోటా విన్న మాట

నీ పేరే నీ ఊసే చెప్పేనంట ఈ ఊరే

నీ పైటకొంగే నా జండాలే

నా ప్రాణమా నీకిక దండాలే


మీసాలు కొసాయి ఓ కొడవలై

ఓ సామీ నా సిగ్గులే


నక్షత్రాలు కన్ను మీట

నీలో నన్ను చూసుకుంటా

వెన్నెలమ్మ నీడల్లోనా దాగి పోదాం


పావురమా పావురమా

ప్రేమకు నువ్వే చిరునామా


నా తెలుపు నీ ఎరుపు

ఒక్కటయ్యే కల కందామా

చెమటకు కూడా మనసుంది

ఈ చేమంతికి అది తెలిసింది

నా చిన్ని గుండెను కలిసింది

కొత్త కొత్త దారులు తెరిచింది


పావురమా…ఆ


పాట – పావురమా పావురామా (Pavuramaa Pavuramaa)

చిత్రం – విదుదల పార్ట్ 2 (Vidudala Part 2)

గాయకుడు – ఇళయరాజా (Ilaiyaraaja) & అనన్య భట్ (Ananya bhat)

సంగీత దర్శకుడు: ఇళయరాజా (Ilaiyaraaja)

గీతరచయిత: ఇళయరాజా (Ilaiyaraaja)

తారాగణం: విజయ్ సేతుపతి (Vijay Sethupathi), మంజు వారియర్ (Manju Warrier)

దర్శకుడు: వెట్రి మారన్ (Vetri Maaran)

నిర్మాత: ఎల్రెడ్ కుమార్ (Elred Kumar)

Post a Comment