Search Suggest

Neethone Song Lyrics in telugu- Vinay Shanmukh songs

Neethone Song Lyrics penned by Suresh Banisetti, music composed by Pradeep Sagar, and sung by Chinmayi Sripada & Hari Charan Seshadri
Neethone Song Lyrics in telugu- Vinay Shanmukh songs
Pic Credit: Vinay Shanmukh (YouTube)


నీతోనే నీతోనే ఉండాలనిపిస్తోంది

నూరేళ్ళు నీ కంటిపాపలా

ఈ మాటే ఇంకోసారందామనిపిస్తోంది

వింటావ ఓ చంటిపాపలా


నా అడుగైనా నీతోనే

పరుగైనా నీతోనే

నా ఊపిరి నువ్వే అంటానే

నా కలలన్నీ నీతోనే

కధలన్నీ నీతోనే

కడదాకా కలిసి ఉంటానే


ఒకటా రెండా మూడా

ఎన్నో ఎన్నో ఊహల్లోన

నన్నే అందంగా ఊగిస్తున్నావే


ఒకటా రెండా మూడా

లెక్కేలేని రంగుల్లోన

మనసంతా ముంచేస్తున్నావే


నీ చూపుల్తో ఈ చీకటంతా

వెలిగించావే సూర్యుడితో

అవసరమే లేనంతగా

నీ నవ్వుల్తో పగలేమో

వెన్నెల కురిపించావే

జాబిల్లే కుళ్ళుకు చచ్చేటంతగా


మాటలతోటే నన్ను మాయే చేస్తావే

కనులే కలిపేసి

కొంటె కలలు తెస్తావులే

పిచ్చనిపించే ప్రేమలో

మత్తు నాలో కూడా నింపేసావే

ఈ ఈ ఈ క్షణమే


ఒకటా రెండా మూడా

ఎన్నో ఎన్నో ఊహల్లోన

నన్నే అందంగా ఊగిస్తున్నావే


ఒకటా రెండా మూడా

లెక్కేలేని రంగుల్లోన

మనసంతా ముంచేస్తున్నావే


ఒకటవుదామా మనలాంటి

ఇంకో జత లేదంటు

విడదీద్దామన్న విడిపోనంతగా

కలిసుందామా మనలోకమేదో మనదేనంటూ

మన మధ్యకి ఎవరూ రాలేనంతగా


నువు చెప్పినవన్నీ

నా మనసే వింటోంది

కనుకే నీ వెనకే

కొత్త పరుగు తీస్తున్నది


ఇద్దరి ఊపిరి ఒక్కటయ్యాక

ఇంతకుమించిన వరమేముంది

హ హ బావుందీ


ఒకటా రెండా మూడా

ఎన్నో ఎన్నో ఊహల్లోన

నన్నే అందంగా ఊగిస్తున్నావే


ఒకటా రెండా మూడా

లెక్కేలేని రంగుల్లోన

మనసంతా ముంచేస్తున్నావే


Director Vinay Shanmukh

Producer Surya Virat

Singers Chinmayee Sripada and Haricharan

Music Pradeep Sagar

Lyrics Suresh Banisetti

Casting    Surya Virat , Diya Seetepalli

 

 

Post a Comment