Search Suggest

OoruPalletooru Lyrical song from balagam movie

ఊరు పల్లెటూరు… దీని తీరే అమ్మ తీరు కొంగులోన దాసిపెట్టి… కొడుకుకిచ్చె ప్రేమ వేరు, Kasarla Shyam, Balagam, Mangli, Ram Miryala
OoruPalletooru Lyrical song from balagam movie


ఆతడు: ఓర్ వారి ఇంక పిండుతున్నావ్రా పాలు,

ఇగెప్పుడు పోతవ్రా ఊల్లెకు నీ యక్క..!

ఇగ పొద్దు పొద్దున్నే మొదలుపెట్నావయా, నీ పాసుగాల..!


ఆమె: కోలో నా పల్లె కోడి కూతల్లే

ఒల్లిరుసుకుందే కోడె ల్యాగల్లే

యాప పుల్లల చేదు నమిలిందే, రామ రామ రామ

తలకు పోసుకుందె… నా నేల తల్లే

అలికి పూసుకుందె.. ముగ్గు సుక్కల్నే

సద్ది మూటల్నే సగ బెట్టుకుందే

బాయి గిరక నా పల్లే


ఆతడు: హే, తెల్ల తెల్లాని పాలధార ఓలే

పల్లె తెల్లారుతుంటదిరా

గుళ్లోని గంటలు కాడెడ్ల మెడలోనే

జంటగ మోగుత ఉంటయిరా

నాగలి భుజాన పెట్టుకుంటే

దోస్తులు చెయ్యేసినట్టేరా

గొడ్డు గోదా పక్కన ఉంటే

కొండంత బలగం ఉన్నట్టురా


ఆతడు: సల్లగాలి మోసుకొచ్చెరా

సేను సెల్కల ముచ్చట్లు

దారి పొడుగు సెట్ల కొమ్మల

రాలుతున్న పూల చప్పట్లు

గడ్డి మోపులు కాల్వ గట్టులు

సెమట సుక్కల్లో తడిసిన

ఈ మట్టి గంధాల…


ఆమె: ఊరు పల్లెటూరు… దీని తీరే అమ్మ తీరు

కొంగులోన దాసిపెట్టి… కొడుకుకిచ్చె ప్రేమ వేరు

ఊరు పల్లెటూరు… దీని తీరే కన్నకూతురు

కండ్ల ముందే ఎదుగుతున్న సంబరాల పంటపైరు


ఆమె: వంద గడపల మంద నా పల్లె

గోడ కట్టని గూడు నా పల్లె

సెరువుల్ల తుల్లేటి జెల్ల శాపోలే, రామ రామ రామ

మావ అత్త బావ బాపు వరసల్లే

ఊరంత సుట్టాల ముల్లె నా పల్లె

దారంలో ఒదిగిన పూల దండల్లే

రంగుల సింగిడి పల్లే


ఆతడు: ఆలు మొగలు ఆడే ఆటలు

అత్త కోడండ్ల కొట్లాటలు

సదిరి సెప్పలేని మొగని తిప్పలే తిప్పలు

రచ్చబండ మీద ఆటలు

చాయబండి కాడ మాటలు

వొచ్చే పొయ్యేటోల్ల మందలిచ్చుకునే సంగతే గమ్మతి


ఆమె: తట్ట బుట్టలల్ల కూర తొక్కులు

సుట్ట బుట్టలల్ల బీడి కట్టలు

చేతనైన సాయం జేసే మనుషులు

మావి పూత కాసినట్టే మనుసులు

ఊరంటే రోజు ఉగాది

సచ్చేదాకా ఉంటది యాది


ఆమె: ఊరు నా ఊరు… దీని తీరే అమ్మ తీరు

కొంగులోన దాసిపెట్టి కొడుకుకిచ్చె ప్రేమ వేరు

ఊరు పల్లెటూరు… దీని తీరే కన్నకూతురు

కండ్ల ముందే ఎదుగుతున్న… సంబరాల పంటపైరు


ఆమె: వంద గడపల మంద నా పల్లె

గోడ కట్టని గూడు నా పల్లె

సెరువుల్ల తుల్లేటి జెల్ల శాపోలే, రామ రామ రామ

మావ అత్త బావ బాపు వరసల్లే

ఊరంత సుట్టాల ముల్లె నా పల్లె

దారంలో ఒదిగిన పూల దండల్లే

రంగుల సింగిడి పల్లే

Song Name - Ooru Palletooru 

Singers - Mangli, Ram Miryala, Bheems Ceciroleo

Lyricist- Kasarla Shyam

Movie - Balagam


Post a Comment