Search Suggest

MA GALLILO OKKADU PORADU private song

మా గల్లీల ఒక్కడు పోరడు అందగాడాడు నన్ను సూత్తడు నన్ను చూసిన సూడనట్టు ఉంటాడు నవ్వుతుంటాడు కన్నుకోడతాడు సైగజేస్తాడు, Jogula Venkatesh, Mounika Yadav
MA GALLILO OKKADU PORADU private song


మా గల్లీల ఒక్కడు పోరడు

అందగాడాడు నన్ను సూత్తడు

నన్ను చూసిన సూడనట్టు ఉంటాడు నవ్వుతుంటాడు కన్నుకోడతాడు సైగజేస్తాడు


వాడు మురిపాల ముద్దుల కృష్ణుడు తెలివిగల్లోడు తెల్లగుంటాడు నన్ను సాటుకిలిసి ముచ్చటంటాడు ముద్దులంటాడు సరసమంటాడు లోల్లి జెస్తాడు 


ఇగ పొద్దున్నే మా వాడ కొత్తాడు

కావలుంటాడు అడ్డమత్తాడు నన్ను కాలేజీ కే వోనియ్యడు బండి తెత్తాడు ఎక్కమంటాడు పోదమాంటాడు


నాకు ఊరు వాడ సూపిత్తాడు

జాతరంటాడు తోలుకవోతాడు నేను అడిగింది నాకు కొనిత్తాడు రాణి వంటడు రాజు నంటాడు మురిసిపోతాడు


వాడు సక్కని మనసున్న పోరడు

ఊరినిడవాడు ఊల్లే ఉంటాడు

ఈ ఊరంతా నవోల్లే అంటాడు తోడు గుంటాడు సాయం అయితాడు సాగి పోతాడు


వాడు ఆస్తి పాస్తి దండిగున్నోడు

కానీ లేనోడు అన్నట్టు ఉంటాడు

అందరితోని కలిసి మెలిసి ఉంటాడు బుద్ధి మంతుడు సదువుకున్నోడు సక్కనైనోడు



వాడు సుక్కల్లో మెరిసేటి సంద్రుడు కలవ కల్లోడు కాంతి నవ్వొడు పరాయి అమ్మాయిలను సూడడు

దారి ఇస్తాడు పక్కకెళ్తాడు పారిపోతాడు


మరి నేనంటే పడి సచ్చి పోతాడు నన్ను ఇడవడు కలవరిస్తాడు

వాడు పడుకున్న నా పేరే తల్తాడు మొండిగునమోడు మాయజేసాడు మనసుదోసాడు



నా మేనత్త ముద్దుల కొడుకాడు వరస అయినోడు మేనబావాడు నా మేడలోన తాళి కట్టేటోడు ఏలు వడుతాడు ఎలుకుంటాడు తోడుగుంటాడు


నా మేనత్త ముద్దుల కొడుకాడు వరస అయినోడు మేనబావాడు నా మేడలోన తాళి కట్టేటోడు ఏలు వడుతాడు ఎలుకుంటాడు తోడుగుంటాడు


Lyrics : Jogula Venkatesh

Singer : Mounika Yadav Mamindla

Music  : Kalyan Keys

Post a Comment