Search Suggest

Chiru Bidiyam Song Lyrics in Telugu from Charitha Kaamakshi Movie

Chiru Bidiyam Song Lyrics in Telugu from Charitha Kaamakshi Movie, చిరు బిడియం మదిలో మోమాటం చిన్న భయం ఎదలో ఆరాటం తొందరగా తగదని నెమ్మదిగా తికమలా త్ర

Chiru Bidiyam Song Lyrics in Telugu



చిరు బిడియం మదిలో మోమాటం

చిన్న భయం ఎదలో ఆరాటం

తొందరగా తగదని నెమ్మదిగా

తికమలా త్రోవలో


ఆ వైపుగ… ఈ వైపుగ

అడుగులు పడుతున్నా

ఆ పని అని… ఈ పని అని

తడబడుతున్నా


తన మనిషికి పని తెలుపుట

తప్పేం కాకున్నా

ఏంటిదీ ఈ వింతా, ఆ ఆఆ ఆ


మ్ మ్ మనసంతా ఏదో మోమాటమే

ఎద అంత ఏదో ఓ ఆరాటమే

పదపద అని సాగేనే అతి వేగమే

ఒద్దొద్దని ఆపేనే చిరు బిడియమే


నీ మాటలు లిపి మూటలు నా నవ్వులు

నవ్వులకు తోడాయే చిరు సిగ్గులు

నీ పలుకులు నా కులుకుని పిలిచాయిలా

నాలోని నువ్వే నిండావిలా


నీ మాటలు నా మాటలు

కలిసిన ఈ వేళా

నిండావా నాలోనే

నీ కబురులు నా కబురులు

కట్టిన ఈ కోట… మనదేగా, మనదేగా


నా మదిలో మాయం మోమాటమే

ఎద గదిలో బిడియం మాయమే

నీ మాటలు నాకింకా చిరు పాటలే

ఆ పాటకు భావం నీవేనులే

Movie: Charitha Kaamakshi
Singer: Chinmayee Sripada
Music: Abu
Lyrics: Manohar Palisetti
Star Cast: Divya Sripada, Naveen Bethiganti

1 comment

  1. Great Work
    Andhrashakthi.in