Search Suggest

Mrogindi Kalyana Veena Song Lyrics in Telugu

మ్రోగింది కళ్యాణ వీణ..ఆ..ఆ.. మ్రోగింది కళ్యాణ వీణ.. నవ మోహన జీవన మధువనిలో..నా..ఆ.. మ్రోగింది కళ్యాణ వీణ.. ఆ..ఆ.. మ్రోగింది కళ్యాణ వీణ..
Mrogindi Kalyana Veena Song Lyrics in Telugu


ఆహహా..ఆ..ఆ.. ఆ..ఆ..ఆ.. ఆహాహా..

మ్రోగింది కళ్యాణ వీణ..ఆ..ఆ..

మ్రోగింది కళ్యాణ వీణ..

నవ మోహన జీవన మధువనిలో..నా..ఆ..

మ్రోగింది కళ్యాణ వీణ..

ఆ..ఆ.. మ్రోగింది కళ్యాణ వీణ..


నవ మోహన జీవన మధువనిలో..నా..ఆ..

మ్రోగింది కళ్యాణ వీణ..ఆ..ఆ..

మ్రోగింది కళ్యాణ వీణ..


పిల్ల గాలితో నేనందించిన

పిలుపులే విన్నావో..ఓ..ఓ..

నీలి మబ్బుపై నే లిఖియించిన

లేఖలందుకున్నావో..

ఆ లేఖలే వివరించగా.. రస రేఖలే ఉదయించగా

ఆ లేఖలే వివరించగా.. రస రేఖలే ఉదయించగా

కల వరించి.. కలవరించి

కల వరించి.. కలవరించి.. పులకిత

తనులత నిను చేరుకోగా..ఆ..ఆ..

మ్రోగింది కళ్యాణ వీణ..ఆ..ఆ..

మ్రోగింది కళ్యాణ వీణ..


మత్త కోకిలలు ముత్తైదువులై

మంగళ గీతాలు పాడగా..ఆ..

మయూరాంగనలు ఆట వెలదులై..

లయ లహరులపై ఆడగా..

నా యోగమే ఫలియించగా..


ఆ దైవమే కరుణించగా..

నా యోగమే ఫలియించగా..

ఆ దైవమే కరుణించగా..

సుమసరుడే పురోహితుడై..

సుమసరుడే పురోహితుడై..

శుభ ముహూర్తమే నిర్ణయించగా..ఆ..ఆ..

మ్రోగింది కళ్యాణ వీణ..ఆ..ఆ..

మ్రోగింది కళ్యాణ వీణ..


నవ మోహన జీవన మధువనిలో..నా..ఆ..

మ్రోగింది కళ్యాణ వీణ..ఆ..ఆ..

మ్రోగింది కళ్యాణ వీణ..


చిత్రం: కురుక్షేత్రం (1977)

నేపధ్య గానం: బాలు, సుశీల

Post a Comment