Search Suggest

నువ్వు లేక అనాధలం - Nuvvu Leka Andhalam Song Lyrics

నువ్వు లేక అనాధలం బ్రతుకంతా అయోమయం నువ్వు లేక అనాధలం బ్రతుకంతా అయోమయం బాబా ఓ బాబా ఇక నీ పరీక్షకు మేమాగలేము ఇటులీ నీరీక్షణ మేమోర్వలేము నువ్వు లేక అ

సాయి బాబా ….సాయిబాబా….

సాయినాధా….సాయిదేవా….

సత్యం నిత్యం నీవేకావా


నువ్వు లేక అనాధలం బ్రతుకంతా అయోమయం

నువ్వు లేక అనాధలం బ్రతుకంతా అయోమయం

బాబా ఓ బాబా

ఇక నీ పరీక్షకు మేమాగలేము ఇటులీ నీరీక్షణ మేమోర్వలేము

నువ్వు లేక అనాధలం బ్రతుకంతా అయోమయం

నువ్వు లేక అనాధలం బ్రతుకంతా అయోమయం

బాబా ఓ బాబా


మా పాలి దైవం అని మా దిక్కు నీవేనని కొలిచాము దినం దినం సాయి

మా ఆర్తి చూస్తావని సాక్షాత్కరిస్తావని వేచాము క్షణం క్షణం సాయి….

శ్రీరాముడైనా….శ్రీకృష్ణుడైనా…. ఏ దైవమైనా .

నీలోనేచూచాము సాయి….

రావా….బాబా….రావా….

రక్షా….రక్షా నీవేకదా మా బాబా .. నువ్వు..


మా ఏసు నీవేనని మా ప్రభువూ నీవేనని

ప్రార్ధనలు చేశామయా నిన్నే..

అల్లాగ వచ్చావని చల్లంగ చూస్తావని

చేశాము సలాం సలాం నీకే

గురునానకైనా ..గురుగోవిందైనా..

గురుద్వారమైనా..నీ ద్వారకేననీ

నీ భక్తులైనాము సాయి..రావా .. నువ్వు..

కృష్ణసాయి కృష్ణసాయి రామసాయి ( 2 )

అల్లాసాయి మౌలాసాయి ( 2 )

నానక్ సాయి గోవింద్ సాయి

ఏసు సాయి షిర్డి సాయి ఓం.. నానక్ ..

సాయి సాయి బాబా సాయి..


Movie Name : Sri shirdi saibaba Mahathyam (1986)

Music Director : Ilayaraja

Lyricist : Athreya

Singers : S.P.Bala Subramanyam and Chorus

Post a Comment