Search Suggest

anukoledenadu song lyrics in telugu from "Oy !" Movie

అనుకోలేదేనాడు ఈ లోకం నాకోసం అందంగా ముస్తాబై ఉంటుందని ఈ క్షణమే చూస్తున్నా ఊరేగే వేడుకలు ఊరించే ఎన్నెన్నో వర్ణాలని కనిపించే ఈ సత్యం స్వప్నమే అనుకోనా..
anukoledenadu song lyrics in telugu from "Oy !" Movie


అనుకోలేదేనాడు ఈ లోకం నాకోసం అందంగా ముస్తాబై ఉంటుందని

ఈ క్షణమే చూస్తున్నా ఊరేగే వేడుకలు ఊరించే ఎన్నెన్నో వర్ణాలని

కనిపించే ఈ సత్యం స్వప్నమే అనుకోనా నిజమంటే ఎవరైనా నమ్మనే లేకున్నా

అందరిలో ఇన్నాళ్ళు శిలనై ఉన్నా నడిసంద్రంలో ఈనాడే అలనయ్యానా


నీలి నింగిలో తేలుతున్న కొంటె వానవెల్లే నా నవ్వులో జారినా రంగులేరుకోదా

నీటి పొంగులో తుళ్లుతున్న చిట్టి చేప పిల్లై నా వేగమే ఇమ్మనీ నన్ను కోరుకోదా

రేగే నా ఊహల్ని ఊరేగనీ సాగే ఆ గువ్వల్ని ఓడించగా

నా సైగకు తలవంచి ఆ మేఘమే చినుకల్లే నా ముందే వాలిందిగా

ఒదిగున్న చిన్ని మనసే తొలి నడక నేచుకున్నదా

ఇక ఉన్న చోటనే ఉంటుందా


నిన్న లేని ఆ స్నేహమేదో నీడలాగ మారి నా తోడుగా చేరుతూ నన్ను వీడనందా

ఉన్నపాటుగా ఈ ప్రయాణం సాగుతున్న దారి ప్రతి మలుపులో వింతలే నాకు చూపుతుందా

ఈ కలలే తీరేనా ఇన్నాళ్లకి సాయంగా మారిందా ఆ స్నేహమే

గుండెల్లో దాగున్న నా పాటకి రాగాలే నేర్పిందా ఈ బంధమే

ఈ ఆశ జారిపోని తీరాన్ని చేరుకోనీ నూరేళ్ల జీవితం నాదవనీ


Movie Name : Oy !

Language : Telugu

Singer : Shreya Ghoshal

Lyrics : Vanamali

Music Director: Yuvan Shankar Raja

Post a Comment