Search Suggest

అడిగిన వరములనియ్యాలి Adigina Varamulaniyyali Song Lyrics

అడిగిన వరములనియ్యాలి ఓ దీనదయా - దివ్యస్వరూపా 2 మీ దివ్య వరములు ఎన్నో విధములు అడిగినవారికి అందించెదవు అల్పుల గాంచుము - ఆత్మస్వరూపా
అడిగిన వరములనియ్యాలి Adigina Varamulaniyyali Song Lyrics


అడిగిన వరములనియ్యాలి

ఓ దీనదయా - దివ్యస్వరూపా  2


మీ దివ్య వరములు ఎన్నో విధములు 

అడిగినవారికి అందించెదవు 

అల్పుల గాంచుము - ఆత్మస్వరూపా 

ఆత్మ నీయవే - దీనస్వరూపా                           ''అడిగిన''


మీ దివ్యమహిమను కనుగొనగలరా 

మహిమ స్వరూపా - మనుజావతారా 

మనసును మార్చవే - మరియతనయా 

మహిమానేత్రములిచ్చి చూపవే                       ''అడిగిన''


పరమును విడచిన పావనరూపా 

మరణము గెలచిన మహిమాస్వరూపా 

నీవే మార్గము నీవే సత్యము ఆ...ఆ...ఆ...    

నీవే జీవము జీవనరూపా                                 ''అడిగిన'' 


పదివేలలో అతి సుందరుడవు 

వందనమయ్యా ఓ యేసుదేవా 

అందించుము నీ ఆత్మవరము ఆ...ఆ...ఆ...   

అందుకొనుము - నా వందనములు                 ''అడిగిన''

Christian Songs

Post a Comment