ప్రియా నిను చూడలేక ఊహల్లో నీరూపురాక
నీ తలుపుతోనే నే.. బ్రతుకుతున్నా . . .
నీ తలపుతోనే నే.. బతుకుతున్నా..
ప్రియా నిను చూడలేక ఊహల్లో నీరూపురాక…
వీచేటి గాలులను నేనడిగాను నీకుశలం..
ఉదయించే సూర్యుడినే నేనడిగాను నీకుశలం..
అనుక్షణం నామనసు తహతహలాడే..
ప్రతిక్షణం నీకోసం విలవిలలాడే..
అనుదినం కలలలో నీకధలే..
కనులకు నిదురలే కరువాయె..
ప్రియా నిను చూడలేక..
ఊహల్లో నీరూపు రాక..
కోవెలలో కోరితినీ నీదరికీ నను చేర్చమని..
దేవుడినే వేడితినీ కలకాలం నిను చూడమని..
లేఖతో ముద్దయినా అందించరాదా..
నినుగాక నీ కలనీ పెదవంటుకోదా..
వలపులు నీదరి చేరుటెలా..
ఊహల పడవలే చేర్చునులే..
ప్రియా నిను చూడలేక..
ఊహల్లో నీరూపురాక..
హా..అ... నీ తలుపుతోనె బతుకుతున్నా . . .
నీ తలపుతోనే నే బతుకుతున్నా..
ప్రియా నిను చూడలేక ఊహల్లో నీరూపురాక...
Priya Ninu Chudaleka Song Lyrics in Telugu Details
Song Name: Priya Ninu Chudaleka
Movie Name: Prema Lekha(1996)
Music: Deva