Search Suggest

Preyasi Raave Songs Lyrics in Telugu

నీ కోసం నీ కోసం… జీవించా చిలకా… నా ప్రాణం నీ వేనే మణితునకా… నా కోసం నా కోసం… నిన్నే నా జతగా… ఏ దైవం పంపేనో బహుమతిగా

నీ కోసం నీ కోసం… జీవించా చిలకా

నా ప్రాణం నీ వేనే మణితునకా

నా కోసం నా కోసం… నిన్నే నా జతగా

ఏ దైవం పంపేనో బహుమతిగా..


నిన్నూ నన్నూ పెనవేసే… ప్రేమే సాక్షిగా

కన్నూ కన్నూ కలబోసే… కలలే పండగా..

మిన్నూ మన్నూ… ఏకం చేద్దాం హరివిల్లుగా..


నా కోసం నా కోసం… నిన్నే నా జతగా

ఏ దైవం పంపేనో బహుమతిగా..


నా ఊపిరిలో ఉయ్యలేసి… నూరేళ్ళ కాలం..

నిను లాలించాలి… వెచ్చని కలల్ని పంచాలి..

నీ స్నేహంలో స్నానం చేసి… నా కన్నే దేహం తరించిపోవాలి

తీయని స్వరాలు పాడాలి..


పరులకు ఎన్నడు తెలియని… చల్లని చెలిమితో

ఈ నా అనురాగం… నీ గుండెనే మీటనీ..

విరహపు వేడికి కనబడక… విడవని జోడుగ ముడిపడగా

అల్లే ఈ బంధం… కలకాలముండి పోనీ..


నీ కోసం నీ కోసం… జీవించా చిలకా..

నా ప్రాణం నీ వేనే మణితునకా..


కాసేపైన కల్లోనైనా.. నీ ఊహ లేని క్షణాలు ఉన్నాయా

ఒంటరి తనాలు ఉన్నాయా..

ఏం చేస్తున్నా ఎటు చూస్తున్నా.. నీ రూపు లోనే

ప్రతీది చూస్తున్నా… నిన్నే ప్రపంచమంటున్నా..


మమతలు చిందిన.. మధువులు విందుకు

అతిధులుగా ఆహ్వానిద్దాం.. ఆరారు కాలాలనీ..

అలలకు అందని జాబిలిని.. వెన్నెల వానగ దించుకొని..

గెలిచే సంద్రంలా.. సంతోషం పొంగిపోనీ..


నా కోసం నా కోసం.. నిన్నే నా జతగా..

ఏ దైవం పంపేనో బహుమతిగా..


నిన్నూ నన్నూ పెనవేసే.. ప్రేమే సాక్షిగా..

కన్నూ కన్నూ కలబోసే.. కలలే పండగా..

మిన్నూ మన్నూ ఏకం చేద్దాం హరివిల్లుగా..

ఆఆ ఆ ఆఆ ఆ ఆఆ ఆ.. ఆఆ ఆ ఆఆ ఆ ఆఆ ఆ..


నీ కోసం నీ కోసం జీవించా చిలకా Preyasi Raave Songs Lyrics in Telugu Details

Movie: Preyasi Raave (19 November 1999)

Singer: S.P. Balasubrahmanyam, Chitra

Music: M.M. Srilekha

Lyrics: Sirivennela Seetharama Sastry

Actors: Srikanth, Raasi, Prithiveeraj

Post a Comment