Search Suggest

Meghalalo Thelipomanadhi Song Lyrics in Telugu - మేఘాలలో తేలిపోమన్నది

మేఘాలలో తేలిపోమన్నది తూఫానులా రేగిపొమన్నది అమ్మాయితో సాగుతూ చిలిపి మది బీట్ ఇన్ మై హార్ట్ ఎందుకింత కొత్తగుంది

మేఘాలలో తేలిపోమన్నది 

తూఫానులా రేగిపొమన్నది

అమ్మాయితో సాగుతూ చిలిపి మది

బీట్ ఇన్ మై హార్ట్ ఎందుకింత కొత్తగుంది

హీట్ ఇన్ మై తాట్ వెంటబడి చుట్టుకుంది

ఓ మై గాడ్ ఏమిటింత కొత్తగున్నది

బీట్ ఇన్ మై హార్ట్ ఎందుకింత కొత్తగుంది

హీట్ ఇన్ మై తాట్ వెంటబడి చుట్టుకుంది

ఓ మై గాడ్ ఏమిటింత కొత్తగున్నది


హల్లో పిల్లా అంటూ ఆకతాయి ఆనందాలు

ఆలపిస్తూ ఉంటే స్వాగతాలే సంగీతాలు

ఆడదా నెమలి తీరుగా మనసు ఘల్ ఘల్ ఘల్లుమని

ఆకాశమే హద్దు పావురాయి పాపాయికి

ఆగే మాటే వద్దు అందమైన అల్లర్లకి

పారదా వరద హోరుగా వయసు ఝల్ ఝల్ ఝల్లుమని

ఓ నమః వచ్చి పడు ఊహలకు

ఓ నమః కళ్ళువిడు ఆశలకు

ఓ నమః ఇష్టమైన అలజడికి


నచ్చినట్టే ఉంది రెచ్చిపోయే పిచ్చి స్పీడు

వద్దంటున్నా విందే చెంగుమంటూ చిందే ఈడు

గువ్వలా రివ్వు రివ్వున యవ్వనం ఎటుపోతుంది

కట్ట లేక ఈడు నన్ను మెచ్చుకుంది నేడు

పందెం వేస్తా చూడూ పట్టలేడు నన్నెవ్వడూ

అంతగా బెదురు ఎందుకు మనకు ఎదురింకేముంది

నీ తరహ కొంప ముంచేటట్టే ఉంది

నా సలహా ఆలకిస్తే సేఫ్టీ ఉంది

ఏంటి మహా అంత జోరు కాస్త నెమ్మది


బీట్ ఇన్ మై హార్ట్ ఎందుకింత కొత్తగుంది

హీట్ ఇన్ మై తాట్ వెంటబడి చుట్టుకుంది

ఓ మై గాడ్ ఏమిటింత కొత్తగున్నది

బీట్ ఇన్ మై హార్ట్ 

హీట్ ఇన్ మై తాట్

ఓ మై గాడ్

Meghalalo Thelipomanadhi Song Lyrics in Telugu - మేఘాలలో తేలిపోమన్నది Song Details

Music Director : Shashi Preetam
Lyrics Writer : Sirivennela
Singer : Gaayatri,  Mano (nagoor babu)

Post a Comment