Search Suggest

Vaana Vaana Velluvaye Song Lyrics in Telugu

వాన వాన వెల్లువాయే కొండకోన తుళ్లిపోయే చెలియ చూపులే చిలిపి జల్లులై మేను తాకగా ఏదో ఏదో ఏదో హాయి వాన వాన వెల్లువాయే కొండకోన తుళ్లిపోయే ప్రియుని శ్వాసలే పిల్లగాలులై

 పల్లవి : Vaana Vaana Song

వాన వాన వెల్లువాయే కొండకోన తుళ్లిపోయే

చెలియ చూపులే చిలిపి జల్లులై

మేను తాకగా ఏదో ఏదో ఏదో హాయి

వాన వాన వెల్లువాయే కొండకోన తుళ్లిపోయే

ప్రియుని శ్వాసలే పిల్లగాలులై

మోము తాకగా ఏదో ఏదో ఏదో హాయి

చరణం : 1

చక్కని చెక్కిలి చిందే అందపు గంధం

పక్కన చేరిన మగ మహరాజుకి సొంతం

తొలకరి చిటపట చినుకులలో మకరందం

చిత్తడి పుత్తడి నేలకదే ఆనందం

చివురుటాకుల చలికి ఒణుకుతూ చెలియ చేరగా ఏదో ఏదో ఏదో హాయి

వాన వాన వెల్లువాయే కొండకోన తుళ్లిపోయే

చరణం : 2

ఒకరికి ఒకరై హత్తుకుపోయిన వేళ

ఒడిలో రేగెను ఏదో తెలియని జ్వాల

ముసిరిన చీకటిలో చిరుగాలుల గోల

బిగిసిన కౌగిట కరిగించెను పరువాల

కలవరింతలే పలకరింపులై పదును మీరగా ఏదో ఏదో ఏదో హాయి

వాన వాన వెల్లువాయే కొండకోన తుళ్లిపోయే

ప్రియుని శ్వాసలే పిల్లగాలులై

మోము తాకగా ఏదో ఏదో ఏదో హాయి


Lyrics: Bhvana Chandra

Singer: Chitra/ Balu

Music: Bappi Lahari


Vana Vana Velluvaye Telugu PDF Download

Download Song in PDF Format from Here

Post a Comment