Search Suggest

One Way One Way Song Lyrics Gamyam Movie (2008)

వన్ వే వన్ వే జీవితానికి ఎక్కడ ఉందో గమ్యమన్నది తెలియదు అన్న ఆగదెమది సాగిపోయే ప్రయాణం రన్‌వే లాంటిది కాదుగా ఇది ఎన్నో ఎన్నో మలుపులున్నది

 Go Go Go Go Gamyam

Go Go Go Go Gamyam

U never know how u love the game

U never know how to worship the game

Until u know to love yourself

Love your soul you will love yourself common


వన్ వే వన్ వే జీవితానికి 

ఎక్కడ ఉందో గమ్యమన్నది 

తెలియదు అన్న ఆగదెమది 

సాగిపోయే ప్రయాణం

రన్‌వే లాంటిది కాదుగా ఇది 

ఎన్నో ఎన్నో మలుపులున్నది 

ఎగుడూ దిగుడూ చూసుకొనిది పరుగు తీసే ప్రవాహం

నీ దారిలోన నవ్వు చిలకరించే మల్లె పూవులు 

తియతీయ్యగానే నిన్ను గాయ పరిచే తేనెటీగలెన్నో

ఎంత వింతనీ తెలుసుకో ప్రపంచం 

అంతు తేలనీ సృష్టిలో రహస్యం

ఎంత వింతనీ తెలుసుకో ప్రపంచం

అంతు తేలనీ సృష్టిలో రహస్యం

వన్ వే వన్ వే జీవితానికి

ఎక్కడ ఉందో గమ్యమన్నది

తెలియదు అన్న ఆగదెమది

సాగిపోయే ప్రయాణం


జగమే ఒక మాయ బ్రతుకే ఒక మాయ 

అది అన్నది ఎవరో అది విన్నది ఎవరో

మనసునే పట్టి లాగే 

ప్రేమ ఎంత మాయ అనుకున్న 

ఒక్క చూపుకే బతికే 

ఆ మాయలో హాయి లేదా

ఇప్పుడిక్కడ రేపు ఎక్కడ అన్న ఈ మిస్టరీకి

బదులు ఎవ్వరూ చెప్పలెరుగా అందుకే నేటీ రోజే నీదే

ఎంత చిన్నదొ తెలుసుకో జీవితం 

అంత కన్న అతి చిన్నదీ యవ్వనం

ఎంత చిన్నదొ తెలుసుకో జీవితం

అంత కన్న అతి చిన్నదీ యవ్వనం


తను పుట్టిన చొటె ఉంటుందా చినుకు

తను వెళ్లే చొటె తెలుసా మరి తనకు 

నిన్న అన్నది ఇక రాదు గతమంటే ఎందుకా మోజు 

రేపు అన్న ఆ రోజు కలాలంటిదే కదా మనకు 

ఎన్ని వేల చిరు దేశాలో కలిపి మనిషి అవతారం 

కళ్ళు మూసి తెరిచేలోగా మారిపోతుందీ నాటక రంగం 

ఎంత చిత్రమో తెలుసుకో ప్రపంచం 

తెలుసుకుంటే నీ సొంతమే సమస్తం

ఎంత చిత్రమో తెలుసుకో ప్రపంచం 

తెలుసుకుంటే నీ సొంతమే సమస్తం

వన్ వే వన్ వే జీవితానికి

ఎక్కడ ఉందో గమ్యమన్నది

తెలియదు అన్న ఆగదెమది

సాగిపోయే ప్రయాణం

నీ దారి లోనేనవ్వు చిలకరించే మల్లె పూవులు

తియతీయ్యగానే నిన్ను గాయ పరిచే తేనెటీగలెన్నో

ఎంత వింతనీ తెలుసుకో ప్రపంచం

అంతు తేలనీ సృష్టిలో రహస్యం

ఎంత వింతనీ తెలుసుకో ప్రపంచం

అంతు తేలనీ సృష్టిలో రహస్యం


Movie    :  Gamyam

Lyrics    :  E S Murthy

Music    :  E S Murthy, R Anil

Singers  :  Ranjith, Noel

Cast     :  Sharwanand, Allari Naresh, Kamilini Mukherjee

2 comments

  1. I wish to purchase this blog for 50000 rupees. Message me at whatsapp : 7 0 0 1 382516. We can also become partners to earn money from this website.

    Visit my Latest Songs lyrics site: lyrics.1mut.com


  2. WRM
    This comment has been removed by the author.