Search Suggest

Melamellaga Song Lyrics Venkatadri Express Movie (2013)

మెల మెల్లగా చిగురించెనే నా మనసులో ఓ కోరికా మరుమల్లెలా వికసించెనే ఎదలోతులో ఈ కలయికా పెదవంచులుదాటి మౌనమే దిగివచ్చెను నేలా.. పొగమంచును మీటిన కిరణమ

మెల మెల్లగా చిగురించెనే 

నా మనసులో ఓ కోరికా

మరుమల్లెలా వికసించెనే 

ఎదలోతులో ఈ కలయికా

పెదవంచులుదాటి మౌనమే దిగివచ్చెను నేలా..

పొగమంచును మీటిన కిరణమే తెచ్చెను హాయిలా

నిలువెల్లా నిండిపోయెనే నువ్వే నేనులా 

ఐ లవ్యు సో.. ఐ లవ్యు సో...

ఐ లవ్యు సో.. ఐ లవ్యు సో...

మెల మెల్లగా చిగురించెనే 

నా మనసులో ఓ కోరికా


అనుకోని తీరమైనా నిను నేను చేరనా

చిరుగాలి తాకుతున్నా చిగురాకులా 

ననుచూసి ఇలా నాక్కూడా కొత్తగ ఉందికదా

కలకాదు కదా నీ వెంట ఉన్నది నేనేగా

ఐ లవ్యు సో.. ఐ లవ్యు సో...

ఐ లవ్యు సో.. ఐ లవ్యు సో...

మెల మెల్లగా చిగురించెనే 

నా మనసులో ఓ కోరికా


మెరుపల్లె చేరువైతే చినుకల్లె మారనా

నీలోన నేనుకరిగీ.. పులకించనా

నీకోసమిలా కదిలేటి నిముషమునాపేస్తా

నీతోడుఅలా సాగేటి కాలమె నేనౌతా

ఐ లవ్యు సో.. ఐ లవ్యు సో...

ఐ లవ్యు సో.. ఐ లవ్యు సో...

మెల మెల్లగా చిగురించెనే 

నా మనసులో ఓ కోరికా


Movie    :  Venkatadri Express

Lyrics    :  Kasarla Shyam

Music    :  Ramana Gogula

Singers  :  Shwetha Mohan, Anjana Sowmya

Cast     :  Sandeep Kishan, Rakul Preet Singh

1 comment

  1. I wish to purchase this blog for 50000 rupees. Message me at whatsapp : 7 0 0 1 382516. We can also become partners to earn money from this website.

    Visit my Latest Songs lyrics site: lyrics.1mut.com