Search Suggest

Cheliya Cheliya Song Lyrics Manmadhudu Movie (2002)

చెలియా చెలియా చేజారి వెళ్ళకే సఖియా సఖియా ఒంటరిని చేయకే నడి రేయి పగలు చూడక సుడిగాలై వస్తా సూటిగా ఎడబాటే బాటై రానా నీదాకా..

చెలియా చెలియా చేజారి వెళ్ళకే

సఖియా సఖియా ఒంటరిని చేయకే

నడి రేయి పగలు చూడక

సుడిగాలై వస్తా సూటిగా

ఎడబాటే బాటై రానా నీదాకా..

పడి లేచే ఎరటం తీరుగా

దిశలన్నీ దాటే హోరుగా

నిను తాకే దాకా ఆగదు నా కేక

చెలియా చెలియా చేజారి వెళ్ళకే

సఖియా సఖియా ఒంటరిని చేయకే

నడి రేయి పగలు చూడక

సుడిగాలై వస్తా సూటిగా

ఎడబాటే బాటై రానా నీదాకా..


కదలికే తెలియని శిలని కదిలించి ఓ ప్రేమా

కలయికే కల అని మాయమైపోకుమా

గతముగా మిగిలిన చితిని బతికించి ఓ ప్రేమా

చెరిపినా చెరగని గాయమైపోకుమా

మౌనమా అభిమానమా పలకవా అనురాగమా

ఒడిపోకే ప్రాణమా వీడిపోకుమా

అడుగడుగు తడబడుతు నిను వెతికి వెతికి కనులు అలిసిపోవాలా

చెలియా చెలియా చేజారి వెళ్ళకే

సఖియా సఖియా ఒంటరిని చేయకే


నిలిచిపో సమయమా తరమకే చెలిని ఇకనైనా

చెలిమితో సమరమా ఇంతగా పంతమా

నిలవకే హృదయమా పరుగు ఆపొద్దు క్షణమైనా

నమ్మవేం ప్రణయమా అంత సందేహమా

వేరుచేసే కాలమా చేరువైతే నేరమా

దాడి చేసే దూరమా దారి చూపుమా

విరహాలే కరిగేలా జత కలిపి నడుపు వలపు కథలు గెలిచేలా

చెలియా చెలియా చేజారి వెళ్ళకే

సఖియా సఖియా ఒంటరిని చేయకే

నడి రేయి పగలు చూడక

సుడిగాలై వస్తా సూటిగా

ఎడబాటే బాటై రానా నీదాకా..

పడి లేచే ఎరటం తీరుగా

దిశలన్నీ దాటే హోరుగా

నిను తాకే దాకా ఆగదు నా కేక


Movie    :  Manmadhudu

Lyrics    :  Sirivennela

Music    :  Devi Sri Prasad

Singer   :  Shaan

Cast     :  Nagarjuna, Sonali Bendre

1 comment

  1. I wish to purchase this blog for 50000 rupees. Message me at whatsapp : 7 0 0 1 382516. We can also become partners to earn money from this website.

    Visit my Latest Songs lyrics site: lyrics.1mut.com