ఎందుకో ఏమిటో తొలిసారి నా గుండెలో
నీ ఊసులే మొదలాయెనే ఈ వేళా...
ఎందుకో ఏమిటో నిదురింక రాదేమిటో
కనుపాపాలో కల కాదుగా ఈ మాయా...
ఎప్పుడు లేనిది నాలో అలజడి
ఎవ్వరు చెప్పలేదే ప్రేమని
ఎందుకో ఏమిటో తొలిసారి నా గుండెలో
నీ ఊసులే మొదలాయెనే ఈ వేళా...
ప్రేమనే మాటకి అర్ధమే నాకు రాదే
ఎవ్వరో చెప్పగా ఇప్పుడే తెలిసెనే
నీ జతే చేరగా నా కథే మారిపోయే
లోకమే బొత్తిగా గుర్తుకే రాదులే
చినుకై చేరిన వరదై పోయెనే
ఎవరు అపలేరే ప్రేమని
ఎందుకో ఏమిటో తొలిసారి నా గుండెలో
నీ ఊసులే మొదలాయెనే ఈ వేళా...
గాలిలో వేలితో ఆశలే రాసుకోన
నీవనే ప్రేమని శ్వాసగా పీల్చనా
నీటిలో నీడలో నిన్నిలా చూసుకోన
ఊహలో తేలుతూ ఊసులే ఆడన
లోకం ఎంతగా మారిందే ఇలా
పగలే జాలువారే వెన్నెలా
ఎందుకో ఏమిటో తొలిసారి నా గుండెలో
నీ ఊసులే మొదలాయెనే ఈ వేళా...
Movie : Dil
Lyrics : Kula Sekhar
Music : R P Patnaik
Singer : R P Patnaik
Cast : Nithin, Neha