స్వప్న వేణువేదో సంగీత మాలపించే
సుప్రభాతవేళా శుభమస్తు గాలి వీచే
జోడైనా రెండు గుండెలా ఏక తాళమో
జోరైనా యవ్వనాలలో ప్రేమ గీతమో
లేలేతా పూల బాసలూ కాలేవా చేతి రాతలూ
స్వప్న వేణువేదో సంగీత మాలపించే
సుప్రభాతవేళా శుభమస్తు గాలి వీచే
నీవే ప్రాణం నీవే సర్వం నీకై చేశా వెన్నెల జాగారం
ప్రేమా నేనూ రేయి పగలూ హారాలల్లే.. మల్లెలు నీకోసం
కోటి చుక్కలూ అష్ట దిక్కులూ నిన్ను చూచు వేళా
నిండు ఆశలే రెండు కన్నులై చూస్తేనేరాలా
కాలాలే ఆగిపోయినా గానాలే మూగబోవునా
నాలో మోహం రేగే దాహం దాచేదెపుడో పిలిచే కన్నుల్లో...
ఓడే పందెం గెలిచే బంధం రెండూ ఒకటే కలిసే జంటల్లో....
మనిషి నీడగా మనసు తోడుగా మలుచుకున్న బంధం
పెను తుఫానులే ఎదురు వచ్చినా చేరాలీ తీరం
వారేవా ప్రేమ పావురం వాలేదే ప్రణయ గోపురం
స్వప్న వేణువేదో సంగీత మాలపించే
సుప్రభాతవేళా శుభమస్తు గాలి వీచే
జోడైనా రెండు గుండెలా ఏక తాళమో
జోరైనా యవ్వనాలలో ప్రేమ గీతమో
లేలేతా పూల బాసలూ కాలేవా చేతి రాతలూ
స్వప్న వేణువేదో సంగీత మాలపించే
సుప్రభాతవేళా శుభమస్తు గాలి వీచే
Movie : Ravoyi Chandamama
Lyrics : Veturi
Music : Manisharma
Singers : S P Balu, Chitra
Cast : Nagarjuna, Anjali Javeri