Search Suggest

Nuvve Na Shwasa Song Lyrics Okariki Okaru Movie (2003)

నువ్వే నా శ్వాస మనసున నీకై అభిలాష బ్రతుకైనా నీతోనే చితికైనా నీతోనే వెతికేది నే నిన్నేనని చెప్పాలని చిన్ని ఆశ ఓ ప్రియతమా... ఓ ప్రియతమా నువ్వే నా

నువ్వే నా శ్వాస మనసున నీకై అభిలాష

బ్రతుకైనా నీతోనే చితికైనా నీతోనే

వెతికేది నే నిన్నేనని చెప్పాలని చిన్ని ఆశ

ఓ ప్రియతమా... ఓ ప్రియతమా

నువ్వే నా శ్వాస మనసున నీకై అభిలాష


పూవుల్లో పరిమళాన్ని పరిచయమే చేశావు

తారలలో మెరుపులన్ని దోసిలిలో నింపావు

మబ్బులోన చినుకులన్ని మనసులోన కురిపించావు

నవ్వుల్లో నవలోకాన్ని నా ముందే నిలిపినావుగా...

నీ జ్ఞాపకాలన్నీ ఏ జన్మలోనైనా

నే మరవలేనని నీతో చెప్పాలని చిన్ని ఆశ

ఓ ప్రియతమా... ఓ ప్రియతమా...

నువ్వే నా శ్వాస మనసున నీకై అభిలాష


సూర్యునితో పంపుతున్నా అనురాగపు కిరణాన్ని

గాలులతో పంపుతున్నా ఆరాధన రాగాన్ని

ఏరులతో పంపుతున్నా ఆరాటపు ప్రవాహాన్ని

దారులతో పంపిస్తున్నా అలుపెరుగని హృదయలయలని

ఏ చోట నువ్వున్నా నీ కొరకు చూస్తున్నా

నా ప్రేమ సందేశం విని వస్తావని చిన్ని ఆశ

ఓ ప్రియతమా...ఓ ప్రియతమా...


Movie    :  Okariki Okaru

Lyrics    :  Chandrabose

Music    :  M M Keeravani

Singer   :  Shreya Ghoshal

Cast     :  Sriram, Aarthi Chabriya

Post a Comment