పడమర కొండల్లో వాలిన సూరీడా
పగిల కోటలనే వదిలిన మారేడా
పడమర కొండల్లో.... వాలిన సూరీడా
పగిల కోటలనే వదిలిన మారేడా
తడిసిన కనుల్లో.. మల్లీ ఉదయించి
కలలొ దేవుడిలా కాపై ఉంటావా
నీ అడుగలకే మడుగులు వొత్తె వాళ్ళం
నువ్వంటె ప్రాణం ఇచ్చెవాల్లం మేమయ్యా
దండాలయ్యా దండాలయ్యా
మాతోనే నువు ఉండాలయ్యా
దండాలయ్యా దండాలయ్యా
మాతోనే నువు ఉండాలయ్యా
తమనేలె రాజును
మోసే భాగ్యం కలిగిందనుకుంటు
ఈ బండల గుండెలు పొంగి పండగ అయిపోదా
తను చిందించే చమటను తడిసే
పుణ్యం దొరికిందనుకుంటూ
పులకించిన ఈ నేలంతా పచ్చగ అయిపోదా
నీ మాటే మా మాటయ్యా
నీ చూపే శాసనమయ్యా
మా రాజూ నువ్వే
తండ్రీ నువ్వే కొడుకు నువ్వే
మా ఆయువు కూడా నీదయ్యా
దండాలయ్యా దండాలయ్యా
మారాజై నువు ఉండాలయ్యా
దండాలయ్యా దండాలయ్యా
మారాజై నువు ఉండాలయ్యా
Movie : Bahubali 2
Lyrics : M M Keeravani
Music : M M Keeravani
Singer : Kaala Bhaiarava
Cast : Prabhas, Rana, Anushka, Tamanna