Search Suggest

Andhari Bhanduvayya Song Lyrics Devullu Movie (2000)

అందరి బందువయ్ భద్రాచల రామయ్య ఆదుకునే ప్రభువయ్యా ఆ అయోధ్య రామయ్య అందరి బందువయ భద్రాచల రామయ్య ఆదుకునే ప్రభువయ్యా ఆ అయోధ్య రామయ్య చేయూతనిచ్చే వాడయ్య

 రామా..ఆ..ఆ..రామా..ఆ..ఆ..

అందరి బందువయ్ భద్రాచల రామయ్య

ఆదుకునే ప్రభువయ్యా ఆ అయోధ్య రామయ్య

అందరి బందువయ భద్రాచల రామయ్య

ఆదుకునే ప్రభువయ్యా ఆ అయోధ్య రామయ్య

చేయూతనిచ్చే వాడయ్య మా సీతారామయ్య

చేయూతనిచ్చే వాడయ్య మా సీతారామయ్య

కోర్కెలు తీర్చే వాడయ్య కోదండరామయ్య

అందరి బందువయ్యా భద్రాచల రామయ్య

ఆదుకునే ప్రభువయ్యా ఆ అయోధ్య రామయ్య

రామా..ఆ..ఆ..రామా..ఆ..ఆ..


తెల్లవారితే చక్రవర్తియై రాజ్యమునేలే రామయ్య

తండ్రి మాటకై పదవిని వదిలి అడవులకేగెనయా

మహిలో జనులను కావగ వచ్చిన మహావిష్ణు అవతారమయా

ఆలిని రక్కసుడు అపహరించితే ఆక్రోశించెనయా

అసురుని త్రుంచి అమ్మను తెచ్చీ అగ్ని పరీక్ష విధించెనయా

చాకలి నిందకు సత్యము చాటగ కులసతినే విడనాడెనయ

నా రాముని కష్టం లోకంలో ఎవరూ పడలేదయ్యా..ఆ..ఆనా రాముని కష్టం లోకంలో ఎవరూ పడలేదయ్యా..ఆ..ఆ

సత్యం ధర్మం త్యాగంలో అతనికి సరిలేరయ్యా

కరుణా హృదయుడు శరణను వారికి అభయమొసగునయ్యా

అందరి బందువయ్యా భద్రాచల రామయ్య

ఆదుకునే ప్రభువయ్యా ఆ అయోధ్య రామయ్య


భద్రాచలము పుణ్యక్షేత్రము అంతా రామమయం

భక్తుడు భద్రుని కొండగా మార్చి కొలువై ఉన్న స్థలం

పరమ భక్తితో రామదాసు ఈ ఆలయమును కట్టించెనయ

సీతారామలక్ష్మణులకు ఆభరణములే చేయించెనయ

పంచవటిని ఆ జానకి రాముల పర్ణశాల అదిగో

సీతారాములు జలకములాడిన శేషతీర్దమదిగో

రామభక్తితో నదిగా మారిన శబరి ఇదేనయ్యా..ఆ ఆ..

రామభక్తితో నదిగా మారిన శబరి ఇదేనయ్యా

శ్రీరామ పాదములు నిత్యం కడిగే గోదావరి అయ్యా

ఈ క్షేత్రం తీర్దం దర్శించిన జన్మ ధన్యమయ్యా

అందరి బందువయ్యా భద్రాచల రామయ్య

ఆదుకునే ప్రభువయ్యా ఆ అయోధ్య రామయ్య

చేయూతనిచ్చే వాడయ్య మా సీతారామయ్య 

కోర్కెలు తీర్చే వాడయ్య కోదండరామయ్య

అందరి బందువయ్యా భద్రాచల రామయ్య

ఆదుకునే ప్రభువయ్యా ఆ అయోధ్య రామయ్య


Movie    :  Devullu

Lyrics    :  Jonnavittula Ramalingeswara Rao

Music    :  Vandemataram Srinivas

Singer   :  S P Balu    

1 comment

  1. mahakal stotram lyrics