Search Suggest

Julayi Title Song Lyrics from Julai Movie (2012)

నానేడ పుడితే నీకేటన్నాయ్... నానెట్టగుంటే నీకేటన్నాయ్ నానేటిసేత్తే నీకేటన్నాయ్... సిర్రాకు పెట్టకన్నాయ్ నే దమ్ము కొడితే నీకేటన్నాయ్...

నానేడ పుడితే నీకేటన్నాయ్... 

నానెట్టగుంటే నీకేటన్నాయ్ 

నానేటిసేత్తే నీకేటన్నాయ్... 

సిర్రాకు పెట్టకన్నాయ్ 

నే దమ్ము కొడితే నీకేటన్నాయ్... 

నే డప్పు కొడితే నీకేటన్నాయ్ 

నే కన్నుకొడితే నీకేటన్నాయ్... 

కొట్టానో పళ్లురాల్తాయ్ 

నా షర్టుకెన్ని బొత్తాలున్నాయ్... 

ఒంటికెన్ని టీకాలున్నాయ్ 

నా జీన్స్‌కెన్ని కన్నాలున్నాయ్... 

సెల్ నంబర్‌కెన్ని సున్నాలున్నాయ్ 

మా నాన్నకెన్ని బాకీలున్నాయ్... 

చెల్లికెన్ని రాఖీలున్నాయ్ 

ఈ తిక్క తిక్క ప్రశ్నలన్ని తొక్కేసెయ్ 

నేనో పక్క జులాయ్ ఐతే నీకేంటన్నాయ్ 

ఉళ్లాయిళ్లాయి మై హూ జులాయి

ఉళ్లాయిళ్లాయి మై హూ జులాయి

ఉళ్లాయిళ్లాయి మై హూ జులాయి 

ఉళ్లాయిళ్లాయి మై హూ జులాయి 


ఏ పోస్టరెనక ఏ బొమ్ముందో... 

ఏ ప్లాస్టరెనక ఏ దెబ్బుందో 

ఏ బంతి ఎనక ఏ సిక్సరుందో... 

కొట్టాకే చూడగలవు 

ఏ లేబులెనక ఏ సరుకుందో... 

ఏ టేబులెనక ఏ సొరుగుందో 

ఎహే ముట్టకుండా చెయ్యెట్టకుండా 

నువ్వెట్టా చెప్పగలవు 

తెల్లగుంటె జున్ను కాదూ... 

నల్లగుంటే మన్ను కాదూ 

మెరిసిపోతే గోల్డు కాదూ... 

మాసిపోతే ఓల్డు కాదూ 

పై లుక్కు చూసి లెక్కలేస్తే తప్పన్నాయ్ 

నన్ను ఆరా తియ్యడాలు మానెయ్యన్నాయ్ 

ఉళ్లాయిళ్లాయి మై హూ జులాయి

ఉళ్లాయిళ్లాయి మై హూ జులాయి 


నా పేరు పిప్పరమెంటు నా ఒళ్లంతా కరెంటు 

నా షేపే ట్రంపెట్టు నా సుపే బుల్లెట్ట్టు 

అరె... సక్కెరకన్నా స్వీటు 

నా లిక్కరుకన్నా ఘాటు 

నా ఫేసే ఫ్లడ్‌లైటు ఎలిగిస్తా మిడ్‌నైటు 

హే... ఊరంతా గందరగోళం 

రాత్రైతే రంగుల మేళం 

సీకటి సిందుల గజ్జెల తాళం నాలో హైలైటు 

ఉళ్లాయిళ్లాయి రావో జులాయి... 

ఉళ్లాయిళ్లాయి సూపిస్తా హాయి... 


నీ లెక్కకేమొ నే బే వార్సు... 

నా లెక్కలోన నే ఏ క్లాసు 

నీ గోల నీది నా గొడవ నాది 

మనకెందుకంట క్లాషు 

నేనెటెళ్లాంది నాకే తెల్సు 

నీ చూపుకేమొ అది టైం పాసు 

ఏ లెన్సు పెట్టి నువు చూడగలవు 

నా సీరియస్‌నెస్సూ 

టెన్తు ఫెయిల్ మరి టెండూల్కర్ 

క్రికెట్ మాస్టరే కాలేదా

పేపర్‌బాయ్ టు ప్రెసిడెంటు 

అబ్దుల్ కలాము కథ వినలేదా 

ఎవడి ఫేటు ఏటవుద్దొ జాంతా నై 

అది తేల్చాలంటే నువు సరిపోవన్నాయ్ 

ఉళ్లాయిళ్లాయి మై హూ జులాయి

ఉళ్లాయిళ్లాయి మై హూ జులాయి 


Movie    :  Julai

Lyrics    :  Ramajogayya Sastry

Music    :  Devi Sri Prasad

Singers  :  Priya Himesh, Suchit Suresan

Cast     :  Allu Arjun, Ileana

Post a Comment