Skip to main content

Osey Ramulamma Song Lyrics Osey Ramulamma Movie (2000)

ఓ ముత్యాల రెమ్మా ఓ మురిపాల కొమ్మ

ఓ పున్నామి బొమ్మ ఓ పుత్తడి గుమ్మ

ఓ రాములమ్మా రాములమ్మా

ఏం చూపులోయమ్మ ఏగు చుక్కనేనమ్మ 

సిరి నవ్వులోయమ్మ చంద్ర వంకలేనమ్మ

ఓ రాములమ్మా రాములమ్మా

నువ్వు కడవ మీద కడవ బెట్టి కదిలితేనమ్మ

ఓ ఒసేయ్ రాములమ్మా

ఆ కరిమబ్బు వరిదుబ్బు కన్ను గిలిపెనమ్మ

ఓ ఓ ఒసేయ్ రాములమ్మా

నువ్వు సిందు మీద సిందేసి సెంగుమంటే నమ్మ

ఓ ఓ ఒసేయ్ రాములమ్మా

ఆ జింక పిల్ల పాదాలకు జంకు పుట్టేనమ్మ

ఓ ఓ ఒసేయ్ రాములమ్మా 

ఓ ఓ ఒసేయ్ రాములమ్మా


పరుగు పరుగు పాయలోన పైకి పైకి తేలుతుంటే 

నురగ తీరుగా ఉన్నావే 

ఓ రాములమ్మ

విచ్చుకోని మొగ్గవోలె పచ్చిపాల నిగ్గువోలె

ముచ్చటేసి పోతున్నవే

ఓ రాములమ్మ

వాగుల్లో వంకల్లో ఆ సేలల్లో ఆ మూలల్లో 

వాగుల్లో వంకల్లో ఆ సేలల్లో మూలల్లో

నువ్వు పచ్చంగుండాలే నువ్వు పదిలంగుండాలే

భూమి తల్లి సాక్షిగ నువ్వు క్షేమంగుండాలే

సూరిడే నీ వంక తేరి చూసేనమ్మ

ఓ ఓ ఒసేయ్ రాములమ్మా

అడుగేస్తే నేలంతా అద్దమాయెనమ్మ

ఓ ఓ ఒసేయ్ రాములమ్మా

ఓ ఓ ఒసేయ్ రాములమ్మా


పసిడి వన్నె ఒంటి మీద పాడు చూపు  పాడకుండా

పసుపు పూసినారే అమ్మలు

ఓ రాములమ్మ

చిట్టి వయసు పారిపోయే సిగురు వయసు చేరెనని

చీర కట్టినారే గుమ్మలో

ఓ రాములమ్మ

దొర గారి దొరసాని దీవెనలా కోసమని

ఆ దొర గారి దొరసాని నిండు దీవెనల కోసమని

కాళ్ళు మొక్తా బాంచనని వంగినావమ్మా

మూడు కుంచాలిస్తే నిలువెత్తు పొంగినావమ్మా

దొరగారి పై ఊగే పంకా వైనావమ్మా

ఓ ఓ ఒసేయ్ రాములమ్మా

దొరసాని కాల్లొత్తే దూది వైనావమ్మా

ఓ ఓ ఒసేయ్ రాములమ్మా

దేవిటినే వెలిగించే దివ్వే వైనావమ్మా

ఓ ఓ ఒసేయ్ రాములమ్మా

నలుగురికి తల్లోని నాల్కవైనావమ్మా

ఓ ఓ ఒసేయ్ రాములమ్మా

ఓ ఓ ఒసేయ్ రాములమ్మా 


చికటింట బిక్కుమంటు కలత పడ్డ కళ్ళల్లోన

బాకులాంటి ఎలుగు మెరిసెనా

ఓ రాములమ్మ

మూగ బడ్డ వెదురులోన ముచ్చటైన రాగాలూదే

ముద్దులయ్య చెయ్యి దొరికేనా

ఓ రాములమ్మ

కష్టాలు కన్నీళ్లు ఉంటాయా చానాళ్ళు

కష్టాలు కన్నీళ్లు నిలిచి ఉంటాయా చానాళ్ళు

ఇంకా పొదలు మాటు పువ్వుల్లాగ ఒదగాలోయమ్మ

గుబులే లేని గువ్వల్లగా ఎగరాలోయమ్మ

పచ్చని అడవితల్లి పందిరవుతుందమ్మా

ఓ ఓ ఒసేయ్ రాములమ్మా 

నీరెండే నీ కాలి పారాణవుతుందమ్మ

ఓ ఓ ఒసేయ్ రాములమ్మా 

పూసేటి పూలన్ని పోసే తలంబ్రాలమ్మ

ఓ ఓ ఒసేయ్ రాములమ్మా 

కోయిలల సందడ్లే సన్నాయి మేళాలమ్మ

ఓ ఓ ఒసేయ్ రాములమ్మా 

ఓ ఓ ఒసేయ్ రాములమ్మా


Movie    :  Osey Ramulamma

Lyrics    :  Suddhala Ashok Teja

Music    :  Vandemataram Srinivas

Singers  :  Swarnalatha, Vandemataram Srinivas

Cast     :  Vijaya Shanthi, Ramki

Comments

  1. సార్..ఈ పాట రాసినవారు డా.సి.నారాయణరెడ్డి గారు..సుద్దాల అశోక్ తేజ గారు కాదు..దయచేసి సవరించగలరు..

    ReplyDelete

Post a Comment

Popular posts from this blog

Ekadantaya Vakratundaya Song Lyrics in Telugu

గణనాయకాయ గణదైవతాయ గనదక్షాయ ధీమహీ గుణ శరీరాయ గుణ మండితాయ గుణేషాయ ధీమహీ గుణాదీతాయ గుణాధీశాయ గుణ ప్రవిష్టాయ ధీమహీ ఏకదంతాయ వక్రతుండాయ గౌరీ తనయాయ ధీమహి గజేషాణాయ బాలాచంద్రాయ శ్రీ గణేషాయ ధీమహి ఏకదంతాయ వక్రతుండాయ గౌరీ తనయాయ ధీమహి గజేషాణాయ బాలాచంద్రాయ శ్రీ గణేషాయ ధీమహి గానచతురాయ గానప్రాణాయ గానాంతరాత్మనె గానౌచుకాయ గానమత్తాయ గానౌ చుక మనసే గురు పూజితాయ, గురు దైవతాయ గురు కులత్వాయినే గురు విక్రమాయ, గుయ్య ప్రవరాయ గురవే గుణ గురవే గురుదైత్య కలక్షేత్రె గురు ధర్మ సదా రాధ్యాయ గురు పుత్ర పరిత్రాత్రే గురు పాకండ కండ కాయ గీత సారాయ గీత తత్వాయ గీత కోత్రాయ ధీమహి గూడ గుల్ఫాయ గంట మత్తాయ గోజయ ప్రదాయ ధీమహి గుణాదీతాయ గుణాధీశాయ గుణ ప్రవిష్టాయ ధీమహీ ఏకదంతాయ వక్రతుండాయ గౌరీ తనయాయ ధీమహి గజేషాణాయ బాలాచంద్రాయ శ్రీ గణేషాయ ధీమహి ఏకదంతాయ వక్రతుండాయ గౌరీ తనయాయ ధీమహి గజేషాణాయ బాలాచంద్రాయ శ్రీ గణేషాయ ధీమహి గంధర్వ రాజాయ గంధాయ గంధర్వ గాన శౌర్య ప్రణైమె గాఢ అనురాగాయ గ్రంధాయ గీతాయ గ్రందార్థ తన్మైయె గురిలే ఏ గుణవతే ఏ గణపతయే ఏ గ్రంధ గీతాయ గ్రంధ గేయాయ గ్రంధాంతరాత్మనె గీత లీనాయ గీతా

Materani Chinnadani Song Lyrics in Telugu

మాటే రాని చిన్నదాని కళ్ళు పలికే ఊసులు.. అందాలన్నీ పల్లవించీ ఆలపించే పాటలు.. ప్రేమే నాకు పంచే..జ్ఞాపకాలురా.. రేగే మూగ తలపే..వలపు పంటరా!! మాటే రాని చిన్నదాని కళ్ళు పలికే ఊసులు.. అందాలన్నీ పల్లవించీ ఆలపించే పాటలు.. ప్రేమే నాకు పంచే..జ్ఞాపకాలురా.. రేగే మూగ తలపే..వలపు పంటరా!! వెన్నెలల్లే పూలు విరిసే తేనెలు చిలికెను.. చెంతచేరి ఆదమరచి ప్రేమలు కొసరెను.. చందనాలు జల్లు కురిసె చూపులు కలిసెను.. చందమామ పట్టపగలే నింగిని పొడిచెను!! కన్నె పిల్ల కలలే నాకిక లోకం.. సన్నజాజి కళలే మోహన రాగం.. చిలకల పలుకులు అలకల ఉలుకులు నా చెలి సొగసులు నన్నే మరిపించే!! మాటే రాని చిన్నదాని కళ్ళు పలికే ఊసులు.. అందాలన్నీ పల్లవించీ ఆలపించే పాటలు.. ముద్దబంతి లేత నవ్వులు చిందెను మధువులు.. ఊసులాడు మేని వగలు వన్నెల జిలుగులు.. హరివిల్లులోని రంగులు నాచెలి సొగసులు వేకువల మేలుకొలుపే  నా చెలి పిలుపులు సందెవేళ పలికే నాలో పల్లవి.. సంతసాల సిరులే నావే అన్నవి.. ముసి ముసి తలపులు తరగని వలపులు.. నా చెలి సొగసులు అన్నీ ఇక నావే!! మాటే రాని చిన్నదాని కళ్ళు పలికే ఊసులు.. అందాలన్నీ పల్లవించీ ఆలపించే పాటలు.. ప్రేమే నాకు పంచే..జ్ఞాపకాలురా.. రేగే మూగ తల

Laali Laali Song Lyrics Swathi Mutyam Movie (1986)

లాలీ లాలీ లాలీ లాలీ  లాలీ లాలీ లాలీ లాలీ  వటపత్రశాయికి వరహాల లాలి  రాజీవ నేత్రునికి రతనాల లాలి  వటపత్రశాయికి వరహాల లాలి  రాజీవ నేత్రునికి రతనాల లాలి  మురిపాల కృష్ణునికి..ఆ......  మురిపాల కృష్ణునికి ముత్యాల లాలి  జగమేలు స్వామికి పగడాల లాలి  వటపత్రశాయికి వరహాల లాలి  రాజీవ నేత్రునికి రతనాల లాలి  లాలీ లాలీ లాలీ లాలీ  లాలీ లాలీ లాలీ లాలీ  కల్యాణ రామునికి కౌసల్య లాలి  కల్యాణ రామునికి కౌసల్య లాలి  యదువంశ విభునికి యశోద లాలి  యదువంశ విభునికి యశోద లాలి  కరిరాజ ముఖునికి...........  కరిరాజ ముఖునికి గిరి తనయ లాలి  కరిరాజ ముఖునికి గిరి తనయ లాలి  పరమాంశభవునికి పరమాత్మ లాలి  వటపత్రశాయికి వరహాల లాలి  రాజీవ నేత్రునికి రతనాల లాలి  జోజో జోజో జో..........  జోజో జోజో జో.......... అలమేలు పతికి అన్నమయ్య లాలి  అలమేలు పతికి అన్నమయ్య లాలి  కోదండరామునికి గోపయ్య లాలి  కోదండరామునికి గోపయ్య లాలి  శ్యామలాంగునికి శ్యామయ్య లాలి  శ్యామలాంగునికి శ్యామయ్య లాలి  అగమనుతునికి త్యాగయ్య లాలి  వటపత్రశాయికి వరహాల లాలి  రాజీవ నేత్రునికి రతనాల లాలి మురిపాల కృష్ణునికి ముత్యాల లాలి  జగమేలు స్వామికి పగడాల లాలి  వటపత్రశాయికి వరహాల లాల