Search Suggest

Egirey Mabbulona Song Lyrics Happy Movie (2005)

ఎగిరే మబ్బులలోన పగలే వెన్నెల వాన పలుకే నవ్వుల వీణ గుండెల్లో సాగే రాగాలేవో ఈ ఉదయం ఏ హృదయం హొ...చేరుతుందో ఈ ప్రేమ ఏ నిమిషం ఏది నిజం హో...

ఎగిరే మబ్బులలోన పగలే వెన్నెల వాన 

పలుకే నవ్వుల వీణ గుండెల్లో సాగే రాగాలేవో 

ఈ ఉదయం ఏ హృదయం 

హొ...చేరుతుందో ఈ ప్రేమ 

ఏ నిమిషం ఏది నిజం 

హో... తెలియకుందే ఆ మాయ 

ఆశపడితే అందనందే ఉరుకుంటే చేరుకుందే 

తగువులోనే చిగురు వేసిందే హే... 

ఎగిరే మబ్బులలోన పగలే వెన్నెల వాన 

పలుకే నవ్వుల వీణ గుండెల్లో సాగే రాగాలేవో 

ఎగిరే మబ్బులలోన పగలే వెన్నెల వాన 

పలుకే నవ్వుల వీణ గుండెల్లో సాగే రాగాలేవో 


నిదరోయే నీకనులు ఎదలోన ఆ కలలు 

ఎదురైన ఎపుడైన కళ్ళారా చూసేనా 

నీతో కలిసి నీతో పెరిగి నీతొ తిరిగి ఆశగా 

నిన్నే తలచి నిన్నే పిలిచి ఈన్నాళ్ళుగా 

నువ్వంటే ఇష్టం ఉన్నా నువ్వే నా సర్వం అన్నా 

నా గుండెల్లో దాచేసిందే మౌనంగా ప్రేమ 


ఎటువైపే నీ పరుగు వినలేదా నా పిలుపు 

ఇపుడైన ఇకనైన నీ పంతం ఆగేనా 

అన్ని మరిచి కోపం విడిచి 

నాతో చెలిమి చేసినా 

పోయే వరకు నా ఈ బతుకు నీదే కాదా 

నీతోడే కావాలంటు నీ నీడై ఉండాలంటు 

నవరాగాలు ఆలాపించే నాలో ఈ ప్రేమ 

ఎగిరే మబ్బులలోన పగలే వెన్నెల వాన 

పలుకే నవ్వుల వీణ గుండెల్లో సాగే రాగాలేవో 

ఎగిరే మబ్బులలోన పగలే వెన్నెల వాన 

పలుకే నవ్వుల వీణ గుండెల్లో సాగే రాగాలేవో 

ఈ ఉదయం ఏ హృదయం 

హే...చేరుతుందో ఈ ప్రేమ 

ఏ నిమిషం ఏది నిజం 

హో... తెలియకుందే ఆ మాయ 

ఆశపడితే అందనందే ఉరుకుంటే చేరుకుందే 

తగువులోనే చిగురు వేసిందే హే... 

ఎగిరే మబ్బులలోన పగలే వెన్నెల వాన 

పలుకే నవ్వుల వీణ గుండెల్లో సాగే రాగాలేవో 

ఎగిరే మబ్బులలోన పగలే వెన్నెల వాన 

పలుకే నవ్వుల వీణ గుండెల్లో సాగే రాగాలేవో


Movie    :  Happy

Lyrics    :  Kula Sekhar

Music    :  Yuvan Shankar Raja

Singer   :  K K

Cast     :  Allu Arjun, Genelia

Post a Comment