Search Suggest

Prapanchame Kadanna Song Lyrics Bhageeratha Movie (2005)

ప్రపంచమే కాదన్నా పైనున్నొడే రాకున్నా నీతో ఉండే దైవం నేస్తం రా అదృష్టమే లేకున్నా నీ కష్టమే తనదన్నా నీలొ ఉండే ప్రాణం నేస్తం రా..

ఓ ఓ ఓ…. ఓ ఓ ఓ… ఓ ఓ ఓ… ఓ ఓ ఓ…

ప్రపంచమే కాదన్నా పైనున్నొడే రాకున్నా

నీతో ఉండే దైవం నేస్తం రా

అదృష్టమే లేకున్నా నీ కష్టమే తనదన్నా

నీలొ ఉండే ప్రాణం నేస్తం రా..

పాపలా నువున్నచో తను కన్ను రా..

పాదమై నువున్నచొ తను మన్ను రా..

వెలుగుల్లోనే కాదు చీకట్లో నీ నీడరా..

ఈ చోటనే కాదు స్వర్గాన నీతొడురా...

ఓ ఓ ఓ…. ఓ ఓ ఓ… ఓ ఓ ఓ… ఓ ఓ ఓ…

ప్రపంచమే కాదన్నా పైనున్నొడే రాకున్నా

నీతో ఉండే దైవం నేస్తం రా

త్యాగాలే చేసేది త్యాగాలే అడిగేది త్యాగంలో బ్రతికేది స్నేహమే

లోపాలే చూసేది అపై సరిచేసేది లాభలే చూడనిది స్నేహమే

పంచే కొద్ది మించిపొయే నిధి తాగే కొద్ది పొంగి పొయే నది..

పంచే కొద్ది మించిపొయే నిధి తాగే కొద్ది పొంగి పొయే నది..

ఇద్దరికిద్దరు రాజులు యేలే రాజ్యం స్నేహనిదీ

యుద్దాలున్నా శాంతిని నిలిపే సైన్యం స్నేహనిదీ....


విశ్వాసం తొలిమేట్టు విశ్వాసం మలిమేట్టు విశ్వాసమే చివరంటూ ఉన్నదీ

ఆకాశం హద్దయిన వినువీధె తనదైన ఈ భూమే నెలవంటూ అన్నదీ

కాలం కన్నా ఇది విలువైనది సత్యం కన్నా ఇది నిజమైనదీ..

కాలం కన్నా ఇది విలువైనది సత్యం కన్నా ఇది నిజమైనదీ..

మనసున దాగిన మనసుని చూపే ఆక్రుతీ స్నేహనిదీ

మనిషిని పూర్తిగా మనిషినిగా మార్చే సంస్కృతి స్నేహనిదీ... 

ఓ ఓ ఓ…. ఓ ఓ ఓ… ఓ ఓ ఓ… ఓ ఓ ఓ…

లాలించగా ఆమ్మల్లే పాలించగా నాన్నాల్లే లభించిన వరమే నేస్తం రా

ఆడించగా అన్నల్లే భొదించగా గురువల్లే చెల్లించనీ రుణమే నేస్తం రా..

పాపలా నువున్నచో తను కన్ను రా..

పాదమై నువున్నచొ తను మన్ను రా..

వెలుగుల్లోనే కాదు చీకట్లో నీ నీడరా..

ఈ చోటనే కాదు స్వర్గాన నీతొడురా...

ఓ ఓ ఓ…. ఓ ఓ ఓ… ఓ ఓ ఓ… ఓ ఓ ఓ…

ఓ ఓ ఓ…. ఓ ఓ ఓ… ఓ ఓ ఓ… ఓ ఓ ఓ…


Movie    :  Bhageeratha

Lyrics    :  Chandrabose

Music    :  Chakri

Singer   :  Shankar Mahadevan

Cast     :  Ravi Teja, Shreya

Post a Comment